
ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల ప్రశాంతత లభిస్తుందని అందరూ భావిస్తారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి ఆర్థిక నష్టాలు, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముళ్ల మొక్కలను ఇంటి లోపల కాకుండా బయట ఉంచుకోవాలి. ఇంట్లో ప్రతికూల ప్రభావాలను ఇచ్చే, పెంచకూడని ముఖ్యమైన మొక్కల వివరాలు ఇక్కడ చూద్దాం:
ఇంటి లోపల కాక్టస్ లేదా ఇతర ముళ్ల మొక్కలను పెంచడం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం ముళ్లు అనేవి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులకు, ఆర్థిక కష్టాలకు, మానసిక ఒత్తిడికి సంకేతం. ఇవి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్లను, గొడవలను పెంచుతాయి. ఒకవేళ వీటిని పెంచాలనుకుంటే ఇంటి లోపల కాకుండా కాంపౌండ్ బయట లేదా గేటు దగ్గర పెట్టుకోవచ్చు.
కొన్ని మొక్కల ఆకులు లేదా కొమ్మలను తెంచినప్పుడు తెల్లటి పాలు కారుతుంటాయి. ఇలాంటి పాలు కారే మొక్కలను ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల పెంచడం వల్ల ధన నష్టం జరుగుతుందని, ఆదాయ మార్గాలు మూసుకుపోతాయని వాస్తు నిపుణులు చెబుతారు.
ఇంటి చుట్టుపక్కల లేదా పెరట్లో తుమ్మ చెట్టు ఉండటం అసలు మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. ఈ చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య నిరంతరం వివాదాలు, వాదనలు పెరిగి ఇంట్లోని శాంతి నశిస్తుంది.
రావి చెట్టు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ, అది ఇంటి ఆవరణలో లేదా గోడలపై స్వయంచాలకంగా పెరిగితే అశుభంగా భావిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు ఉంటే ఆర్థిక పురోగతి నిలిచిపోయి, దరిద్రం చుట్టుముడుతుందని అంటారు.
ఎప్పుడూ పచ్చగా, ముళ్లు లేని, మృదువైన ఆకులు కలిగిన మొక్కలనే ఉదాహరణకు తులసి, మనీ ప్లాంట్ మొదలైనవి ఇంట్లో పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అశుభ ఫలితాలు ఇచ్చే మొక్కలను వెంటనే తీసివేయడం ద్వారా ఆర్థిక కష్టాలు, అప్పుల బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..