Health: సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..

|

Oct 11, 2024 | 9:50 PM

సగ్గుబియ్యం లేదా సాబుదాన మనలో చాలా మంది దీనికి ఎక్కువగా తీసుకుంటుంటారు. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన సమయంలో, లేదా ఉపావసం సమయంలో ఎక్కువగా సాబుదానను తీసుకుంటుంటారు. సాబుదానలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రొటీన్, ఫైబర్‌, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం...

Health: సాబుదాన తింటున్నారా.? అయితే ఓసారి ఆలోచించుకోవాల్సిందే..
Sabudana
Follow us on

సగ్గుబియ్యం లేదా సాబుదాన మనలో చాలా మంది దీనికి ఎక్కువగా తీసుకుంటుంటారు. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన సమయంలో, లేదా ఉపావసం సమయంలో ఎక్కువగా సాబుదానను తీసుకుంటుంటారు. సాబుదానలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రొటీన్, ఫైబర్‌, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సాబుదానతో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సాబుదానను ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* డయాబెటిస్‌తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.

* బరువు తగ్గాలనుకుంటున్న వారు సాబుదానకు దూరంగా ఉండడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు సాబుదానకు దూరంగా ఉండడమే ఉత్తమం.

* జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా సాబుదాన తీసుకోవద్దని నిపుణు చెబుతున్నారు. మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండడమే ఉత్తమం.

* మనలో కొందరికి పిండి పదార్థాలు పడవు. అలెర్జీ కలుగుతుంటుంది. అలాంటి వారికి జీర్ణ, చర్మ లేదా శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు సాబుదానకు దూరంగా ఉండడమే మంచిది.

* కొందరు సాబుదానను డీప్‌ ఫ్రై చేసి తీసుకుంటుంటారు. సాబుదాన వడ రూపంలో తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా అధిక నూనెను తింటుంటాం. అయితే ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడేవారు లేదా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునే వీటికి దూరంగా ఉండడమే ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..