
కాలంతో సంబంధం లేకుండా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. తక్కువ ధరకు లభించే అరటిని పేదల యాపిల్‌గా చెబుతుంటారు. ఇందులోని గుణాలు, రోగ్యానికి దీనివల్ల జరిగే మేలు అలాంటిది. అరటిపండ్లలో విటమిన్ ఎ, సి, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరటి పండును ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా రోజూ ఒక అరటి పండు తింటే చాలు మార్పు మీరే గమనిస్తారు. ఇంతకీ అరటి పండును తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* అరటిలోని ఫైబర్, స్టార్చ్, విటమిన్లు, మినరల్స్, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి ఇవి చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది.
* రోగనిరోధక శక్తిని బలపరడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది. అరటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* అరటిపండు ఎముకలను బలపరుస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలను పటిష్టం చేయడంలో తోడ్పడతాయి. రోజూ అరటిపండ్లు, పాలు తీసుకుంటే ఎముకలు బలపడతాయి.
* అరటిపండులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అరటిపండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
* అరటిపండ్లలో పుష్కలంగా లభించే పొటాషియం మూత్రపిండాల పనితీరు, రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
* అరటిపండ్లు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో వేడిని నివారించడానికి రోజులో ఒకటి లేదా రెండు అరటి పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..