Lifestyle: ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..

|

May 18, 2024 | 12:41 PM

మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్రకూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. నిద్రలేమి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే పడుకునే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? ఇంతకీ ఏ దిశలో పడుకోవడం కరెక్ట్‌.?

Lifestyle: ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..
Sleep
Follow us on

మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్రకూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. నిద్రలేమి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే పడుకునే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? ఇంతకీ ఏ దిశలో పడుకోవడం కరెక్ట్‌.? తప్పుడు విధానంలో పడుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నిద్రించడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. సాధారణంగా గర్భిణీలకు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.

* ఇక వైద్యుల అభిప్రాయం ప్రకారం.. హృద్రోగాలతో బాధపడేవారు కుడి వైపున నిద్రించాలి. ఇలా పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.

* ఇక వెల్లకిలా పడుకోవడం వల్ల స్లీప్ అప్నియా సమస్యకు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక రావడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

* ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు మాత్రం కుడివైపు పడుకోవడమే బెటర్‌.

* బోర్లా పడుకునే వారిలో మెడ, వీపు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వెన్నెముక వంగడంతో పాటు ముఖంపై ముడతలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఒకవేళ బోర్లా పడుకుంటే తలకింద దిండు పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..