Liver Health: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలా..? వీటిని తప్పకుండా తినండి..

|

Oct 27, 2024 | 10:01 AM

శరీరంలో లివర్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే లివర్ పనితీరు దెబ్బతింటే పలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. అందుకే లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లివర్ పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Liver Health: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలా..? వీటిని తప్పకుండా తినండి..
Liver Health
Follow us on

మానవ శరీరంలో కాలేయం, కిడ్నీలు ఎంతో ముఖ్యమైన అవయవాలు. ఇవి మన శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కాలేయం మన శరీరంలోని బ్యాక్టీరియాను ఫిల్టర్‌ చేసి ఆహారాన్ని సులభంగా అరిగించేలా సహాయపడుతుంది. కాలేయంలో సమస్యలు ఎదురైతే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని రకాల ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా కూరగాయలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రోకలీ, క్యాబేజీ వంటి కూరగాయలను క్రమంతప్పకుండా తీసుకోవాలి. వీటిలో మంచి గుణాలు లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోసిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలకూర, కాలే వంటి ఆకుకూరలు కూడా లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ లివర్‌లోని విష పదార్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి.

సిట్రస్‌ జాతికి చెందిన పండ్లు లివర్‌ పనితీరును మెరుగుపరుస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ముక్యంగా నారింజ, ద్రాక్ష వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరుస్తాయి. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్‌ రౌస్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సమస్యలను దూరం చేయడంలో దోహదపడుతుంది. ఒమేగా 3 ఫ్యాడీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే అవిసె గింజలు, చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్‌ ఆయిల్‌ను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యం బాగుపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమ్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా రోజూ తగినంత నీటిని తాగడం వల్ల కూడా లివర్‌ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. రోజూ కచ్చితంగా 8 గ్లాసుల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..