
చిన్న కరివేపాకు .. పెద్ద ఫలితాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని అంటున్నారు.. ఉదయాన్నే కరివేపాకు రసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది బరువు తగ్గటం. 10 కరివేపాకులు, గోరువెచ్చని నీరు, కరివేపాకుని గ్రైండ్ చేసి, గోరువెచ్చటి నీటిలో వేసి.. ఉదయాన్నే తాగాలి. ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు..టాక్సిన్స్ బయటకు పోతాయి. అంతేకాదు ఈ జ్యూస్.. జుట్టు, చర్మానికి కూడా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రసం తాగడం వల్ల డైజెషన్ మెరుగవుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కడుపులో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇది గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించి, పౌష్టికాంశాలను శరీరానికి సులభంగా అందనివ్వడంలో సహాయపడుతుంది.
కరివేపాకు మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కరివేపాకులో ఉండే యాంటీడయాబెటిక్ గుణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి నిలకడగా ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఐరన్ లోపాన్ని తగ్గించడం కరివేపాకులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత (అనేమియా) సమస్యను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల శరీరంలో ఐరన్ పెరుగుతుంది, తద్వారా రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే వారిలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడం కరివేపాకు డీటాక్స్ గుణాలు కలిగి ఉంది. చర్మ సౌందర్యం ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ E వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మంపై ఉన్న ముడతలు, మొటిమలు, ఇతర సమస్యలను తగ్గిస్తుంది. క్రమంగా తినడం వల్ల చర్మం నిగారింపుగా, అందంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దీనిని తింటే శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ తొలగిస్తాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది, అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇది శరీరాన్ని తేలికగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..