
ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తలది ఒకే వంట, ఒకే వంటిల్లు.. కానీ ఇద్దరి ఆలోచనా తీరు మాత్రం వేర్వేరు. ఈ రెండో వ్యక్తి చేసే పని కేవలం శుభ్రతకు సంబంధించింది మాత్రమే కాదు, అది వారి మెదడు అద్భుతమైన పనితీరుకు నిదర్శనం అని మనస్తత్వ శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి. వంట చేస్తూనే శుభ్రం చేసే ఈ అలవాటు వెనుక ఉన్న మానసిక శాస్త్ర రహస్యాలు, అది మన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం..
వంట చేస్తూనే క్లీన్ చేయడం అంటే అది కేవలం అపరిశుభ్రతపై తీసుకునే చర్య కాదు. దీనిని సైకాలజీలో ‘ప్రాస్పెక్టివ్ కాగ్నిషన్’ అని పిలుస్తారు. అంటే మన చేతులు ప్రస్తుతం చేసే పనిలో ఉన్నా, మన మెదడు మాత్రం ఐదు నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది. గిన్నెలు పక్కన పెడితే తర్వాత పని పెరుగుతుందని మెదడు ముందుగానే గ్రహించి, ఖాళీ సమయం దొరికినప్పుడే ఆ పనిని పూర్తి చేయమని మనల్ని ప్రేరేపిస్తుంది. ఇది మెదడులోని ‘ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్’ అనే విభాగానికి సంబంధించింది. ఈ సామర్థ్యం ఎక్కువగా ఉన్నవారు కేవలం వంటింట్లోనే కాదు, వృత్తిపరమైన పనుల్లో మరియు ఒత్తిడిని నిర్వహించడంలో కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు.
న్యూరో సైంటిస్టులు దీనిని ‘యాక్షన్-ఎఫెక్ట్ యాంటిసిపేషన్’ అని పిలుస్తారు. అంటే పని పూర్తికాకముందే రాబోయే ఫలితాన్ని (వంట తర్వాత చిందరవందరగా ఉండే కిచెన్) మెదడు ఊహించి, ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడే పని చేయమని శరీరానికి సంకేతాలు పంపుతుంది. ఇది చాలా మందిలో తెలియకుండానే సహజంగా జరిగిపోతుంటుంది.
చాలా మంది ఇలా వంట చేస్తూ క్లీన్ చేసేవారిని పర్ఫెక్షనిస్టులు అని లేదా కంట్రోల్ అబ్సెషన్ ఉన్నవారు అని భావిస్తారు. కానీ నిజానికి పర్ఫెక్షనిజం అనేది భయం లేదా ఆందోళన వల్ల పుడుతుంది. కానీ ఈ ‘క్లీన్-యాజ్-యూ-గో’ అలవాటు మాత్రం ఎంతో సహజంగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా సాగిపోయే ప్రక్రియ. వీరు మెస్ ను చూసి కంగారు పడరు, కేవలం ఖాళీగా ఉన్న చేత్తో ఆ మురికిని తొలగించి భవిష్యత్తులో పనిని సులభతరం చేసుకుంటారు. దీనినే ‘మినిమల్ ఫుట్‌ప్రింట్’ సూత్రం అని కూడా అంటారు. అంటే తాము వెళ్లే దారిలో ఎటువంటి గుర్తులు లేకుండా, వాతావరణాన్ని మునుపటిలాగే ఉంచాలనే అపస్మారక కోరిక వీరిలో బలంగా ఉంటుంది.
ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోయినా, దీనిని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అలవరుచుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేయడం వల్ల మన మెదడు యొక్క ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది. మన మెదడు ఎంత చురుగ్గా ఉందో చెప్పడానికి వంటిల్లు ఒక చక్కని అద్దం లాంటిది. మీరు వంట చేస్తూనే స్టవ్ క్లీన్ చేస్తున్నారంటే, మీ మెదడు అందరికంటే రెండు అడుగులు ముందే ఉందని అర్థం. అది చాలా గొప్ప విషయం.