
ప్లాస్టిక్ కవర్లలో గాలి చొరబడకపోవడం వల్ల కూరగాయల నుండి విడుదలయ్యే తేమ లోపలే ఉండిపోతుంది. ఇది బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వేగంగా పెరగడానికి కారణమవుతుంది. అంతేకాకుండా, ప్లాస్టిక్ తయారీలో వాడే ప్రమాదకర రసాయనాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూరగాయల్లోకి లీచ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సమస్యల నుండి బయటపడి కూరగాయలను ఎలా నిల్వ చేయాలో, అసలు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు:
గాలి చొరబడకపోవడం: కూరగాయలు తాజాగా ఉండాలంటే గాలి అవసరం. ప్లాస్టిక్ కవర్లు గాలిని నిరోధించడం వల్ల కూరగాయల నుండి వచ్చే తేమ బ్యాక్టీరియా వృద్ధికి దారితీస్తుంది, ఫలితంగా కూరగాయలు త్వరగా కుళ్లిపోతాయి.
రసాయన లీకేజీ: ప్లాస్టిక్ సంచులలో ఉండే బిస్ఫినాల్-ఎ (BPA)థాలేట్స్ వంటి రసాయనాలు ఆహార పదార్థాలలోకి చేరుతాయి. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
పోషకాలు కోల్పోవడం: ప్లాస్టిక్‌లో నిల్వ చేసిన ఆకుకూరలు త్వరగా పాలిపోతాయి. దీనివల్ల వాటిలోని సహజ రుచి విటమిన్లు నశిస్తాయి.
నిల్వ చేసే సరైన పద్ధతులు:
గాలి తగలనివ్వండి: మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను ప్లాస్టిక్ కవర్ల నుండి తీసివేసి, కొంత సమయం గాలిలో ఆరనివ్వాలి.
కాటన్ లేదా మెష్ బ్యాగులు: ప్లాస్టిక్ కవర్లకు బదులుగా కాటన్ బ్యాగులు లేదా రంధ్రాలు ఉన్న మెష్ బ్యాగులను ఉపయోగించడం ఉత్తమం. ఇవి గాలి ఆడేలా చేసి కూరగాయలను తాజాగా ఉంచుతాయి.
పేపర్ టవల్స్: ఆకుకూరలను పేపర్ టవల్స్ లేదా కాటన్ వస్త్రంలో చుట్టి నిల్వ చేయడం వల్ల తేమను పీల్చుకుని అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
తడి లేకుండా చూడండి: కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. తడి ఉంటే త్వరగా బూజు పట్టే అవకాశం ఉంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కోసం నిపుణుల సలహాలు పాటించండి.