
మన ఒంట్లో సాధారణంగా చెవులు, ముక్కు అత్యంత మురికిగా ఉండే భాగాలు అని అనుకుంటారు. అందుకే చెవులను, ముక్కును తరచు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి అంత మురికి భాగాలు కావు. మానవ శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం బొడ్డు. బొడ్డులో బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మజీవులు సులభంగా పేరుకుపోతాయి. కాబట్టి ఈ భాగం శుభ్రత విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీనిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దుర్వాసనకు కారణం అవ్వడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది. కాబట్టి బొడ్డు శుభ్రత విషయంలో తగిన శ్రద్ధ వహించాలి.
బొడ్డు లోపలి వైపున ఉండటం వల్ల అక్కడ చెమట, చనిపోయిన చర్మ కణాలు, సబ్బు మరకలు, బట్టల పీచులు పేరుకుపోతాయి. దీనిని చాలా కాలం పాటు శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. ఈ కారణంగానే బొడ్డు తరచుగా దుర్వాసన వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, బొడ్డులో వేలాది రకాల బ్యాక్టీరియా నివసిస్తాయి. వాటిలో చాలా వరకు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. కానీ చాలా మంది బొడ్డు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టరు. దీనివల్ల బొడ్డు మరింత మురికిగా మారి దుర్వాసన వస్తుంది. అందుకే బొడ్డు పరిశుభ్రత విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
బొడ్డు మురికిగా ఉండే ప్రదేశం కాబట్టి, దానిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం బొడ్డులో బ్యాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది. కాబట్టి దీనిని నివారించడానికి శుభ్రత చాలా అవసరం. అధిక బరువు ఉన్నవారు, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నవారు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పార్ట్‌ను శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఇది మురికిని మరింత సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే బొడ్డు ఎర్రగా ఉన్నా, దురదగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, దుర్వాసన వస్తున్నా దానిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
బొడ్డు తర్వాత, మన ‘నోరు’ అత్యంత మురికిగా ఉంటుంది. మన నోటిలో లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. బొడ్డును శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. స్నానం చేసేటప్పుడు చిన్న దూది ముక్కతో, మెత్తని గుడ్డతో బొడ్డు లోపలి భాగాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.