
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా నూరేళ్లు బతకాలని కోరుకుంటారు. దీన్నే దీర్ఘాయుష్షు అంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలి అలవాట్ల కారణంగా ఈ వందేళ్ల జీవితాన్ని అనుభవిస్తున్నారు. బోర్డు సర్టిఫైడ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మెరెడిత్ బాక్ ప్రకారం, జన్యువులు ముఖ్యపాత్ర పోషించినప్పటికీ, మనం మన జీవన నాణ్యతన్ పెంచుకోడానికి చాలా చేయవచ్చు. “చిన్నతనంలో మీ శరీరాన్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే, వృద్ధాప్యంలో అది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది,” అని ఆమె చెబుతున్నారు.
దీర్ఘకాలం, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి నిపుణులు సూచించిన 9 అలవాట్లు ఇక్కడ ఉన్నాయి:
1. నాణ్యమైన నిద్ర ముఖ్యం
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వృద్ధాప్యానికి నిద్ర చాలా ముఖ్యమైన భాగమని నిపుణులు చెబుతారు. ప్రతి రాత్రి కనీసం ఎనిమిది గంటల నిద్ర పోవడానికి ప్రయత్నించాలి. స్క్రీన్ సమయం తగ్గించడం, ప్రశాంతమైన రాత్రి వేళ దినచర్యను ఏర్పాటు చేసుకోవడం వంటి నిద్ర పరిశుభ్రత అలవాట్ల పాటించాలి.
2. మానసికంగా చురుకుగా ఉండాలి
కాగ్నిటివ్ ఫంక్షన్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే కాగ్నిటివ్ రిజర్వ్ పెరుగుతుంది. ఇది సమస్యలు పరిష్కరించడానికి, ప్రత్యామ్నాయ మార్గాలన్ కనుగొనడానికి మెదడుకు శక్తినిస్తుంది. కమ్యూనిటీ తరగతుల్లో చేరడం, కొత్త హాబీలు నేర్చుకోవడం లాంటివి చేయాలి.
3. క్రమం తప్పకుండా ధ్యానం
ధ్యానం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఇది నిద్రకు కూడా అనుసంధానించబడి ఉంటుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ధ్యానం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
4. మద్యం పరిమితం చేయాలి
రోజుకు మూడు ఆల్కహాల్ పానీయాల కంటే ఎక్కువ తాగడం వలన మెదడు పరిమాణం తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలతో సమస్యలు తెస్తుంది. అప్పుడప్పుడు వైన్ తాగినా, అది ఎంత, ఎంత తరచుగా తాగుతున్నామనే దానిపై అవగాహన ఉండాలి.
5. వినికిడి పరికరాలు వాడాలి
వినికిడి సమస్య ఉన్నప్పుడు వినికిడి పరికరాలు వాడటం వలన, మెదడుకు కీలకమైన ఉద్దీపన అందుతుంది. ఇది మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సంభాషణలు సరిగ్గా వినకపోతే మెదడు ముఖ్యమైన ఉద్దీపన కోల్పోతుంది.
6. ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వృద్ధాప్యంలో చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల తీసుకోవడంపై దృష్టి సారించే మెడిటరేనియన్ ఆహారం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిరూపణ అయింది.
7. క్రమం తప్పకుండా వ్యాయామం
ప్రతి వయస్సులోనూ క్రమం తప్పకుండా వ్యాయామం వారపు దినచర్యలో భాగం కావాలి. కనీసం రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తారు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉత్తమమని చెబుతారు. నడక, యోగా, గార్డెనింగ్ లాంటివి చేయవచ్చు.
8. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నిర్వహణ
రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక పరిస్థితుల లక్షణాలన్ నియంత్రించడం చాలా ముఖ్యం. ఈ వ్యాధుల నిర్వహణ వలన మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందుతాయి.
9. సామాజికంగా చురుకుగా ఉండడం
కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, స్నేహితులకు కాల్ చేయడం లాంటి సామాజిక అలవాట్లు మనసును చురుకుగా ఉంచుతాయి. ఇది కూడా మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.