Lifestyle: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. చర్య సంబంధిత సమస్యలు కూడా..

|

Aug 30, 2024 | 10:09 AM

అయితే ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే ఉప్పు వల్ల చర్మ సంబధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఉప్పు చర్మానికి ఎలా హాని చేస్తుందనేగా.. సాధారణంగా ఉప్పులో...

Lifestyle: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. చర్య సంబంధిత సమస్యలు కూడా..
Salt Effects
Follow us on

ఉప్పు లేకుండా ఏ వంటకాన్ని ఊహించుకోలేం. వంటకు రుచి రావాలంటే కచ్చితంగా ఉప్పు వేయాల్సిందే. అన్ని రకాల మసాలాలు వేసినా, అందులో సరిపడ ఉప్పు లేకపోతే మాత్రం ఎన్ని వేసినా వృథానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నోటికి రుచిని ఇచ్చే ఉప్పు ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. ఉప్పు ఎక్కువతే బీపీ మొదలు, హృదయ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తుంటారు.

అయితే ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే ఉప్పు వల్ల చర్మ సంబధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఉప్పు చర్మానికి ఎలా హాని చేస్తుందనేగా.. సాధారణంగా ఉప్పులో సోడియం ఉంటుందని తెలిసిందే. ఇది శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అయితే మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది.

దీంతో శరీరంలో డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. దీని ప్రభావం నేరుగా చర్మంపై పడుతుంది. ఈ కారణంగా చర్మం పొడిబారడం, నిర్జీవం కావడం, పొరలుగా మారడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కళ్ల చుట్టూ వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో తేలిన విషయాల ప్రకారం.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఇది చర్మం వాపుతో పాటు తామర వంటి సమస్యలకు దారి తీస్తుంది. సాధాణంగా ఫాస్ట్‌ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఫాస్ట్ ఫుడ్‌ తీసుకునే వారిలో తామర ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఉప్పును తగ్గించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రెడ్‌ టు ఈట్‌ ఫుడ్స్‌ వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వీటి స్థానంలో తాజా పండ్లు, గింజలతో పాటు విత్తనాలను తీసుకోవాలి. వంట పూర్తియిన తర్వాత చాలా మంది పై నుంచి ఉప్పు వేసుకుంటారు. దీనివల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఊరగాయలు, చట్నీలలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. తెల్ల ఉప్పుకు బదులుగా, మీరు నల్ల ఉప్పు లేదా రాక్ సాల్ట్‌ను తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..