శరీరంలో ఐరన్ ఎంతటి కీలక ప్రాత్ర పోషిస్తుందో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని అన్ని భాగాకు ఆక్సిజన్ అందడంలో ఐరన్‌ది కీలక పాత్ర. ఐరన్ లోపం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐరన్ లోపాన్ని ఎలా గుర్తించాలి.? ఈ లోపాన్ని జయించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీంలో ఐరన్ లోపం ఉంటే.. అలసట, తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, గుండె సమస్యలు, గర్భధారణ సమస్యలు, పిల్లలలో నెమ్మదిగా పెరుగుదల, జుట్టు రాలడం వంటి లక్షణాల ఆధారంగా ఐరన్ లోపాన్ని గుర్తించవచ్చు. ఇంతకీ ఐరన్ లోపాన్ని తీసుకునే ఆహారంతో ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఫుడ్స్ డేటా సెంటర్ ప్రకారం.. 100 గ్రాముల పచ్చి బచ్చలికూరలో 2.7 mg ఐరన్ ఉంటుంది. అంతే కాదు, ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఇనుము శోషణను పెంచుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు క్రమంతప్పకుండా బచ్చలికూర తీసుకోవాలని చెబుతున్నారు.
* శరీంలో ఐరన్ స్థాయిలను పెంచడంతో గుమ్మడికాయది కీలక పాత్ర. 28 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.5 మి.గ్రా ఐరన్ ఉంటుంది ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ కె, జింక్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఐరన్ లోపాన్ని జయించడంలో ఉపయోగపడుతుంది.
* 1 కప్పు వండిన బ్రోకలీలో 1 mg ఐరన్ లభిస్తుంది. అలాగే, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరం ఐరెన్‌ను బాగా గ్రహించేలా చేస్తుంది. అంతే కాదు, దీని వినియోగం క్యాన్సర్‌ను నివారించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* 28 గ్రాముల చాక్లెట్‌లో 3.4 mg ఐరెన్ ఉంటుంది. దీంతో పాటు పాటు, మెగ్నీషియం, కాపర్ కూడా లభిస్తాయి. రక్తహీన వంటి సమస్యతో బాధపడుతున్నారు డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఐరన్ లోపానికి చెక్ పెట్టొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..