Swimming Precautions: చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే!

బయట ఎండలు ఒక రేంజ్‌లో మండిపోతున్నాయి. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వాటిల్లో స్విమ్మింగ్ చేయడం కూడా ఒకటి. చల్లదనం కోసం చాలా మంది సమ్మర్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. దీంతో ఆ నీటిలో దిగగానే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ నీటిలో నుంచి మళ్లీ బయటకు రావాలని అనిపించదు. అన్నిచోట్లా చెరువులు, కాలువలు లభ్యం ఉండవు కాబట్టి.. చాలా మంది స్విమ్మింగ్ ఫూల్స్‌కి క్యూ కడుతూ ఉంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన..

Swimming Precautions: చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
Swimming Precautions
Follow us

|

Updated on: Apr 25, 2024 | 1:05 PM

బయట ఎండలు ఒక రేంజ్‌లో మండిపోతున్నాయి. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వాటిల్లో స్విమ్మింగ్ చేయడం కూడా ఒకటి. చల్లదనం కోసం చాలా మంది సమ్మర్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. దీంతో ఆ నీటిలో దిగగానే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ నీటిలో నుంచి మళ్లీ బయటకు రావాలని అనిపించదు. అన్నిచోట్లా చెరువులు, కాలువలు లభ్యం ఉండవు కాబట్టి.. చాలా మంది స్విమ్మింగ్ ఫూల్స్‌కి క్యూ కడుతూ ఉంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్విమ్మింగ్‌ ఫూల్‌లో వాటర్ పాడవ్వకుండా ఉండటానికి.. పలు రకాల రసాయనాలు కలుపతారు. ఇలాంటి నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

మాయిశ్చరైజర్ అప్లై చేయాలి:

స్విమ్మింగ్ చేయడం వల్ల బాడీ తేమను కోల్పోతుంది. కాబట్టి మీరు స్విమ్మింగ్ చేసే ముందు బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. లేదంటే క్లోరిన్ న్యూట్రలైజింగ్ లోషన్‌ను రాసుకోవాలి. వీటి వల్ల చర్మం చాలా తేమగా ఉంటుంది. ఇవి తెలియని వారు కొబ్బరి నూనె లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా రాసుకోవాలి.

సన్ స్క్రీన్ అప్లై చేయాలి:

చల్లదనం కోసం చాలా మంది ఇతర దూర ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. స్విమ్మింగ్ ఫూల్ అయినా లేదంటే ఇతర విహార యాత్రలకు వెళ్లినా.. ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేయాలి. దీని వల్ల యూవీ కిరణాల నుండి మీ చర్మం రక్షించబడుతుంది. సన్ స్క్రీన్ రాసుకున్న 20 నిమిషాల ఆ తర్వాత స్విమ్మింగ్ చేయాలి. నీటిలో ఎక్కువగా ఉంటే ఓ గంట తర్వాత మళ్లీ రాసుకోవాలి.

ఇవి కూడా చదవండి

తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండకండి:

స్విమ్మింగ్ చేసిన తర్వాత తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండకూడదు. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చర్మంపై ఇన్ ఫెక్షన్లు కూడా రావచ్చు.

పెదవుల కేర్:

శరీరానికే కాకుండా పెదవుల కోసం కూడా కేర్ తీసుకోవాలి. పెదవులు కూడా సన్ బర్న్, డీ హైడ్రేషన్‌కు గురవుతాయి. కాబట్టి మీరు స్విమ్మింగ్‌కు వెళ్లే ముందు ఎస్పీఎఫ్ లిప్ బామ్‌ను ఉపయోగించండి. నీటిలో ఎక్కువగా ఉంటే.. ఓ గంట తర్వాత మళ్లీ రాసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..