Lifestyle: ఓవెన్‌లో వీటిని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా.? చాలా డేంజర్‌

ప్రస్తుతం మైక్రోవేవ్‌ వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లలో మాత్రమే కనిపించిన మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ ప్రస్తుతం మధ్య తరగతి ఇళ్లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. క్షణాల్లో ఆహారం వేడి చేసుకోవడానికి ఉపయోగపడే ఓవెన్‌లను ఉపయోగించే సమయంలో కొన్ని తప్పులు కూడా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది. కొన్ని రకాల ఆహార వస్తువులను...

Lifestyle: ఓవెన్‌లో వీటిని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా.? చాలా డేంజర్‌
Microwave Oven
Follow us

|

Updated on: May 04, 2024 | 8:17 PM

ప్రస్తుతం మైక్రోవేవ్‌ వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లలో మాత్రమే కనిపించిన మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ ప్రస్తుతం మధ్య తరగతి ఇళ్లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. క్షణాల్లో ఆహారం వేడి చేసుకోవడానికి ఉపయోగపడే ఓవెన్‌లను ఉపయోగించే సమయంలో కొన్ని తప్పులు కూడా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది. కొన్ని రకాల ఆహార వస్తువులను ఓవెన్‌లలో పదే పదే వేడి చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గుడ్లతో పాటు గుడ్ల ఉత్పత్తులను ఓవెన్‌లో మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. ముఖ్యంగా ఉడికించిన గుడ్లను మళ్లీ వేడి చేస్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* రాత్రి మిగిలిన నాన్‌ వెజ్‌ను ఉదయం వేడి చేసుకొని తినడం సర్వసాధారణమైన విషయమే. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మాంసాన్ని ఓవెన్‌లో వేడి చేయడం వల్ల రుచి తగ్గడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. ఒకవేళ వేడి చేయాలనుకుంటే ప్యాన్‌ చేయడం మంచిది.

* మైక్రోవేవ్‌లో బచ్చలికూర వంటి ఆకుకూరలను వేడి చేయకూడదు. వీటిలో నైట్రేట్లు ఉంటాయి. ఇలాంటి వాటిని పదే పదే వేడి చేయడం వల్ల నైట్రేట్లు హానికరమైన నైట్రేట్లుగా మారుతాయి, ఇది క్యాన్సర్‌ వంటి సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు.

* నూనెలో వేయించిన బజ్జీలు, మిర్చిల వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓవెన్‌లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

* ఇక కొందరు ఓవెన్‌లో టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు. సాధారణంగానే టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం మంచిది కాదు, అలాంటిది ఓవెన్‌లో చేస్తే ఆరోగ్యానికి సమస్యగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..