వేడి వల్ల తలనొప్పి వస్తోందా? వెంటనే ఉపశమనం కలిగించే సులభమైన చిట్కాలివే!

వేసవికాలంలో అధిక ఎండ, నిర్జలీకరణం కారణంగా చాలామంది తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటారు. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో పిత్త దోషం పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని సహజంగా తగ్గించుకోవడానికి కొన్ని సులువైన ఇంటి చిట్కాలు సహాయపడతాయి. స్వచ్ఛమైన చందనపు పేస్ట్‌ను నెత్తికి లేదా నొదిటికి రాసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. మరిన్ని ఇంటి చిట్కాలు, సహజ నివారణలు ఇప్పుడు చూద్దాం..

వేడి వల్ల తలనొప్పి వస్తోందా? వెంటనే ఉపశమనం కలిగించే సులభమైన చిట్కాలివే!
Summer Headache Relief

Updated on: Oct 31, 2026 | 11:28 AM

వేసవి కాలంలో తీవ్రమైన ఎండ, ఉక్కబోత కారణంగా చాలామంది తీవ్రమైన తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, అధిక సూర్యరశ్మి, వేడి వల్ల శరీరంలో పిత్త దోషం అసమతుల్యతకు గురై రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. దీనినే పిత్త తలనొప్పి లేదా సూర్యావర్త అంటారు. ఈ వేసవి తలనొప్పిని నివారించడానికి, సహజసిద్ధంగా తగ్గించుకోవడానికి కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

నుదిటిపై చందనపు లేపనం :

చందనానికి అద్భుతమైన శీతలీకరణ గుణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన చందనపు పొడిని రోజ్ వాటర్ లేదా నీటితో కలిపి పేస్ట్‌లా చేసి నొదిటిపై పట్టు వేయాలి. ఇది నరాలను శాంతపరిచి, పిత్త దోషాన్ని తగ్గించి తలనొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

ధనియాల నీరు:

ఆయుర్వేదంలో ధనియాలు శరీర వేడిని తగ్గించే అద్భుతమైన ఔషధంగా పేరుగాంచాయి. ఒక టీస్పూన్ ధనియాలను గ్లాసు నీటిలో రాత్రిపూట నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఇది శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి ఎండ తలనొప్పిని నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

వట్టివేరు కషాయం:

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి వట్టివేరు ఎంతో సహాయపడుతుంది. కొద్దిగా వట్టివేరు వేళ్లను తాగునీటిలో 3-4 గంటలు నానబెట్టి, ఆ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల దప్పిక తీరడంతో పాటు పిత్తం వల్ల వచ్చే తలతిరుగుడు, తలనొప్పి తగ్గుతాయి.

కొబ్బరి నూనెతో మర్దన:

తలకి సహజసిద్ధమైన చల్లటి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఇది తలలో పేరుకున్న వేడిని తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తుంది.

జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 11 నుండి 3 గంటల మధ్య బయటికి వెళ్లడం తగ్గించాలి. వెళ్లాల్సి వస్తే తప్పకుండా గొడుగు లేదా టోపీ ఉపయోగించాలి. దాహం వేయకపోయినా రోజంతా తగినన్ని నీళ్లు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ, సొరకాయ వంటి నీటిశాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us