
ఇందులో విటమిన్-సి కాకుండా, యాంటీ అలర్జీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పికి ఇవి చాలా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయాన్నే యాలకులు, కలకండ కలిపి తినాలి. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఏలకుల్లో విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను అధికంగా ఉంటాయి. తీపితో ఏలకులు కలిపి తింటే శరీర బలహీనత ఇట్టే తగ్గుతుంది.

జలుబు, దగ్గును దూరం చేస్తాయి. మంచినిద్రకు యాలకులు తోడ్పడుతాయి. భోజనం తర్వాత యాలకులు తింటే బరువు తగ్గుతారు. రక్తపోటు ఎక్కువగా ఉంటే యాలకులు తినాలి. యాలకులు ఎముకలను బలంగా ఉంచుతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

యాలకులను తీసుకోవడం వల్ల రక్త పోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా యాలకులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి నియంత్రణలో ఉంటాయి.

చాలామంది నోటిపూత సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి వారు ఏలకులు, కలకండ కలిపి తినడం వల్ల ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. వీటిల్లో ఉండే గుణాలు నోటి పూత లక్షణాలను తగ్గించడంలో మేలు చేస్తాయి.

cardamom