Sleep: వామ్మో నిద్రలేమితో ఇన్ని నష్టాలా.? ఏకంగా ప్రాణామే ప్రమాదంలో..

నిద్రలేమి.. అసలు ఇలాంటి ఓ సమస్య ఉంటుందని గతంలో ఎవరూ ఊహించి కూడా ఉండరేమో. అసలు నిద్ర పట్టకపోవడం ఒక వ్యాధిగా పరిగణిస్తారని కూడా అనుకోకపోవచ్చు. కానీ ప్రస్తుతం నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా మారింది. మారిన జీవన విధానం, వర్క్‌ కల్చర్‌ కారణంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో స్లీపింగ్ పిల్స్‌తో పాటు..

Sleep: వామ్మో నిద్రలేమితో ఇన్ని నష్టాలా.? ఏకంగా ప్రాణామే ప్రమాదంలో..
Sleepless
Follow us

|

Updated on: Jul 02, 2024 | 7:33 PM

నిద్రలేమి.. అసలు ఇలాంటి ఓ సమస్య ఉంటుందని గతంలో ఎవరూ ఊహించి కూడా ఉండరేమో. అసలు నిద్ర పట్టకపోవడం ఒక వ్యాధిగా పరిగణిస్తారని కూడా అనుకోకపోవచ్చు. కానీ ప్రస్తుతం నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా మారింది. మారిన జీవన విధానం, వర్క్‌ కల్చర్‌ కారణంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో స్లీపింగ్ పిల్స్‌తో పాటు మరికొన్ని ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని తెలిసిందే.

కచ్చితంగా ఒక వ్యక్తికి 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. నిద్రలేమి కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడితే శరీరంలో ఉండే యాంటీబాడీస్‌కు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించే సామర్థ్యం తగ్గుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇది ఎన్నో రకాల వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా వచ్చే మరికొన్ని సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* సరిపడ నిద్రలేకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత ప్రమాదమో నిద్రలేమి కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

* రాత్రి సమయాల్లో సరిపడ నిద్రలేకపోతే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. నిద్రలేమి కారణంగా శరీరం తక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు.

* నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నిద్రలేమి కారణంగా గుంఎపోటు వచ్చే ప్రమాదాలు 42 శాతం ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది.

* డయాబెటిస్‌కు నిద్రలేమి కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం నిద్రలేమితో బాధపడే వారు భవిష్యత్తులో డయాబెటిస్‌ సమస్య బారిన పడే వారి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* సరైన నిద్రలేని వారు బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా ఆకలి పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సహజంగానే ఎక్కువగా తింటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

* వీటితో పాటు నిద్రలేమి వల్ల ఒత్తిడి, మానసిక అనారోగ్యాలు, అధిక రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే కచ్చితంగా సరిపడ నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రోహిత్‌శర్మ, కోహ్లీకి విస్తార ఎయిర్‌లైన్స్ ఊహించని ట్విస్ట్..!
రోహిత్‌శర్మ, కోహ్లీకి విస్తార ఎయిర్‌లైన్స్ ఊహించని ట్విస్ట్..!
కారు పొగ రంగు ఆధరంగా.. సమస్య ఏంటో చెప్పొచ్చు..
కారు పొగ రంగు ఆధరంగా.. సమస్య ఏంటో చెప్పొచ్చు..
ఈ 4 పనులు చేయడంలో సిగ్గుపడితే ఎప్పటికీ గెలవలేరు..
ఈ 4 పనులు చేయడంలో సిగ్గుపడితే ఎప్పటికీ గెలవలేరు..
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో సినిమాలే సినిమాలు..లిస్ట్
ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో సినిమాలే సినిమాలు..లిస్ట్
అనంత్‌ అంబానీ-రాధికల 3 రోజుల గ్రాండ్‌ వెడ్డింగ్‌.. షెడ్యూల్ ఇదే!
అనంత్‌ అంబానీ-రాధికల 3 రోజుల గ్రాండ్‌ వెడ్డింగ్‌.. షెడ్యూల్ ఇదే!
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకి చేయాలి: జైశంకర్‌
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకి చేయాలి: జైశంకర్‌
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. ఎవరంటే
ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. ఎవరంటే
మందుపార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లాడని దారుణం..
మందుపార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లాడని దారుణం..
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
రీల్‌ చేద్దామని ఎత్తయిన టవర్‌ ఎక్కాడు.. ఆ తర్వాత ??
రీల్‌ చేద్దామని ఎత్తయిన టవర్‌ ఎక్కాడు.. ఆ తర్వాత ??
నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే ??
నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే ??