రుచికరమైన స్వీట్ కార్న్ సూప్ మీ ఇంట్లోనే.. 

TV9 Telugu

04 July 2024

స్వీట్ కార్న్ సూప్ తయారీకి  కావలసిన పదార్థాలు  స్వీట్ కార్న్, నీళ్లు, తరిగిన క్యారెట్,  తరిగిన క్యాబేజీ, ఉప్పు,  వెనిగర్, మిరియాలపొడి, పంచదార, కార్న్ ఫ్లోర్,  స్ప్రింగ్ ఆనియన్స్.

ఒక మిక్సీ జార్ లో మీకు కావాల్సినన్ని స్వీట్ కార్న్ వేసుకుని కచ్చాపచ్చాగా వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి.

తర్వాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

మరో గిన్నెలో అరలీటర్ నీరు వేడి వేసి గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్, తరిగిన క్యారెట్, క్యాబేజీతో పాటు మరికొన్ని కార్న్ గింజలు వేసుకోవాలి.

దీన్ని ఒక పొంగు వచ్చే వరకూ స్టవ్ పై ఉడికించాలి. పైన ఏర్పడిన నురుగను తీసేసి 8 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

తర్వాత దానికి తగినంత వెనిగర్, మిరియాలపొడి, పంచదార, ఉప్పు వేసి స్టవ్ పై మరో 5 నిమిషాల పటు ఉడికించాలి.

ఇప్పుడు మీరు ముందు కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసి స్టవ్ పైనే బాగా కలపాలి.

అది కొంచెం చిక్కబడేలా ఉడికించాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే.. వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ సూపర్ రెడీ.