Curry Leaves: కరివేపాకు సుగుణాల పట్టుగొమ్మే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

కరివేపాకు లేకుంటే ఏ వంటకాన్నీ వండలేం. ఆయుర్వేదంలో దీనిని కేవలం రుచి కోసమే కాకుండా దీని ఔషధ గుణాలను పలు రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇన్ని ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నప్పటికీ ఈ ఆకులు అందరికీ సరిపడవని మీకు తెలుసా...? అవును కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య..

Curry Leaves: కరివేపాకు సుగుణాల పట్టుగొమ్మే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం
Curry Leaves

Updated on: Apr 13, 2026 | 9:26 PM

కిచెన్‌లో వండే దాదాపు ప్రతి వంటకంలోనూ కరివేపాకు ఉంటుంది. ఇది లేకుంటే ఏ వంటకాన్నీ వండలేం. ఆయుర్వేదంలో దీనిని కేవలం రుచి కోసమే కాకుండా దీని ఔషధ గుణాలను పలు రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇన్ని ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నప్పటికీ ఈ ఆకులు అందరికీ సరిపడవని మీకు తెలుసా…? అవును కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కరివేపాకు ఎవరికి మంచిది కాదు? వాటిని ఎందుకు తినకూడదు? అవి ఎలాంటి సమస్యలను కలిగిస్తాయో? ఇక్కడ తెలుసుకుందాం..

చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారికి మంచిది కాదు

కరివేపాకు సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమైనప్పటికీ ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారిలో అధిక మొత్తంలో కరివేపాకును తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా ప్రమాదం పెరగవచ్చు. దీనివల్ల తల తిరగడం,నీరసం కలగవచ్చు.

అలర్జీలు ఉన్నవారు ముట్టుకోకపోవడమే మంచిది

కొన్ని రకాల మూలికలు లేదా మసాలాలు తీసుకున్నప్పుడు కొందరికి అలెర్జీలు వస్తాయి. అదేవిధంగా కరివేపాకు వల్ల కొందరికి ఎలాంటి సమస్యలు రావు. దీనిని తీసుకున్న తర్వాత, మీకు చర్మంపై దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. అటువంటి సందర్భంలో దాని వాడకాన్ని ఆపివేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు డేంజర్‌

గర్భధారణ సమయంలో శరీరం హార్మోన్ల మార్పులకు మరింత సున్నితంగా ఉంటుంది. కరివేపాకు రసం లేదా అధిక మొత్తంలో కరివేపాకు పొడిని తీసుకోవడం వల్ల కొంతమందిలో వాంతులు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. అందువల్ల దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమం.

జీర్ణ సమస్యలు ఉన్నవారు

కరివేపాకు సాధారణంగా జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ అల్సర్లు లేదా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు పచ్చి ఆకులను నేరుగా నమిలి తింటే కడుపు సమస్యలను ఎదుర్కోవచ్చు.

మూత్రపిండాల సమస్యలు ఉన్న వ్యక్తులు

కొన్ని అధ్యయనాల ప్రకారం మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారు ఏదైనా ఔషధ మొక్కను అధిక మోతాదులో తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. కరివేపాకులోని కొన్ని భాగాలు చికిత్సను ప్రభావితం చేయవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us