తరచూ మౌత్ వాష్ వాడుతున్నారా..? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!

|

Jan 11, 2025 | 1:38 PM

చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు సమస్య నుంచి బయటపడేందుకు మౌత్‌ వాష్‌ని వాడుతుంటారు. మరికొంతమంది దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మౌత్ వాష్‌లను ఎక్కువగా వాడడం వల్ల తీవ్రమైన నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో తప్పక తెలుసుకోవాలి.

తరచూ మౌత్ వాష్ వాడుతున్నారా..? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!
Mouthwash Side Effects
Follow us on

మౌత్‌ వాష్‌ వాడకం దంతాలకు మంచిదే.. కానీ, ప్రతిరోజూ మౌత్ వాష్ వాడటం వల్ల ఆరోగ్యంపై సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ మౌత్ వాష్ వాడకాన్ని పరిమితం చేయాలని సూచిస్తున్నారు. మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మీ నోరు పొడిబారుతుంది. మౌత్‌ వాష్‌ రెగ్యులర్ ఉపయోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. మౌత్ వాష్ రెగ్యులర్ ఉపయోగం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, రోజుకు రెండుసార్లు మౌత్‌వాష్‌ని ఉపయోగించేవారిలో పదవ వంతు కంటే ఎక్కువ మందిలో కూడా ఈ అవకాశం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అధిక ఆల్కహాల్ మౌత్ వాష్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. ఇది అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ మౌత్ వాష్ వాడటం వల్ల దంతాల సమస్య వస్తుంది. దంతాలలో గుర్తులు ఏర్పడతాయి. దంతాలు బలహీనంగా, గరుకుగా మారుతాయి. రోజూ లేదా అతిగా మౌత్ వాష్ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మౌత్ వాష్ లో ఉండే సింథటిక్ పదార్థాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ వినియోగం తగ్గించాలని  కనీసం రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఇంట్లోనే సహజ సిద్దంగా వేప లేదా పుదీనాతో తయారు చేసుకునే మౌత్‌వాష్‌ను వాడితే మంచిదని సూచిస్తున్నారు. దీనిని రోజూ ఉపయోగించవచ్చు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..