Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?

చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే సముద్రపు చేపలా.. చెరువు లేదా నది చేపలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సముద్రపు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, EPA, DHA, అయోడిన్ ఎక్కువగా లభించే అవకాశం ఉండగా.. చెరువు, నది చేపలు ప్రొటీన్లు, ఇతర పోషకాలకు మంచి వనరులు. సాల్మన్, సార్డిన్స్, మాకరెల్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా-3 గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?
Sea Fish Vs Pond Fish

Updated on: Aug 13, 2026 | 6:17 PM

నాన్ వెజ్ ప్రియులు చేపలను ఇష్టంగా తింటారు. వాసత్వానికి చేపల్లో శరీరానికి కావాలసిన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటటలో సహాయపడతాయి.. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పోటీన్లు, ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.. అందుకే.. చాలామంది చేపలను ఇష్టంగా తింటారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు.. శక్తిని పెంపొందించడానికి కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో చేపలు బెస్ట్ ఫుడ్ అని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే.. చేపలు తినే వారిలో తరచూ సందేహాలు వ్యక్తమవుతుంటాయి.. ఏ చేపలు బెస్ట్.. సముద్రపు చేపలా.. లేక చేరువుల్లోని చేపలా.. నదిలో చేపలా.. ? ఇలా పలు రకాలుగా ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి.. అయితే. ఏ చేపలు బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకుందాం..

సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు..

వాస్తవానికి సముద్రపు చేపలు, నది చేపలు, చెరువు చేపలు అన్ని కూడా మంచివే.. అయితే, పోషకాలపరంగా, రుచి, వాసన, లభ్యతలో, ధరలో మార్పులు ఉంటాయి.

సముద్రపు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటాయి.. సముద్రపు చేపల్లో ఉప్పు రుచి, విభిన్నమైన ఘాటు ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉన్న సముద్రపు చేపలు గుండె జబ్బులను తగ్గిస్తాయి. సముద్రపు చేపలు సహజ సిద్ధంగా పెరిగినా కొన్నిసార్లు కాలుష్య ప్రభావం ఉండవచ్చని పేర్కొంటున్నారు.

చెరువు, నది చేపలలో ప్రొటీన్లు, మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. చెరువు చేపల్లో సాదా రుచి ఉంటుంది.. . శరీరానికి తక్షణ శక్తిని, కండరాల పునరుద్ధరణకు ప్రొటీన్‌ను అందిస్తాయి. చెరువు చేపల పెంపకంలో కృత్రిమ మేత, పలు రకాల వేస్టేజ్ పదార్థాలు వాడే అవకాశం ఉంది.

ఎన్నో పోషకాలు..

చేపల్లో ఉండే కొన్ని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్, టూనా, సార్డైన్స్, మాకరెల్ వంటి కొవ్వు చేపల్లో ఈపీఏ, డీహెచ్‌ఏ, మెరైన్ ఒమేగా-3 వంటి ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. ఈపీఏ, డీహెచ్‌ఏ మానవ జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తాయి. మానవ మెదడు, రెటీనా, కొన్ని కణాల్లో డీహెచ్‌ఏ ఎక్కువగా ఉంటుంది. ఈపీఏతో కలిసి ఇది శరీరంలో ఏర్పడే మంటలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఈ మంటలే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ప్రొఫెసర్ ఫిలిప్ కాల్డర్ ప్రకారం, ఈపీఏ, డీహెచ్‌ఏ అధికంగా తీసుకునే వారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయని తెలిపారు.

మెదడు ఆరోగ్యం

చేపల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాల కన్నా అవి ఎక్కడ పెరిగాయి అనేది ముఖ్యం. సముద్రాల లోతుల్లో ఒమేగా-3కి కొరత ఉండదు. మొక్కల నుంచి చిన్న చేపలకు, చిన్న చేపల నుంచి పెద్ద చేపలకు, పెద్ద చేపల నుంచి మనుషులకు ఇది రవాణా అవుతుంది. అయితే, మనం పెంచే చేపల్లో ఈ క్రమం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3తో పాటు, చేపల్లో ఇన్ఫెక్షన్లను తగ్గించే అనేక పోషకాలు ఉంటాయి. చేపలు తింటే మెదడు చురుగ్గా ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఒమేగా-3కి, మెదడు పనితీరుకు మధ్య సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉడికించిన చేపను తినడం వల్ల మెదడు పరిమాణం పెరుగుతుందని కూడా గమనించారు. చేపలు తినకపోతే కలిగే నష్టాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగకపోయినప్పటికీ, తినే వారికి మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

అయితే, మనం తినే చేపలు ఎంత సురక్షితమైనవి, ఎంత ఆరోగ్యవంతమైనవి అన్నదే ప్రధాన సమస్య. మంచి రకం చేపలను ఎంచుకుని తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us