Chicken: వామ్మో.. వండే ముందు చికెన్‌ని కడుగుతున్నారా..? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి

చికెన్ శుభ్రపరచడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్యాంప్లోబ్యాక్టర్, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ కౌన్సిల్ హెచ్చరిస్తోంది. చికెన్‌ను నేరుగా సింక్‌లో కడగకుండా, ఒక గిన్నెలో ఉప్పు, పసుపు వేసి కడిగి, ఆ నీటిని జాగ్రత్తగా పారవేయాలి. మోతాదుకు మించి చికెన్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Chicken: వామ్మో.. వండే ముందు చికెన్‌ని కడుగుతున్నారా..? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి
Safe Chicken Cleaning

Updated on: Mar 16, 2026 | 10:30 AM

నాన్ వెజ్ ప్రియులు.. చికెన్‌ను ఇష్టంగా తింటారు. ఒకప్పుడు పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వండుకునే చికెన్.. ప్రస్తుతం చాలామందికి నిత్యకృత్యంగా మారింది. చికెన్ లేనిదే భోజనం చేయలేని వారు కూడా ఉన్నారు. అయితే, చికెన్ వినియోగం ఎంత సాధారణమైనదో, దానిని శుభ్రపరచడంలోనూ, వండటంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతే ముఖ్యం అంటున్నారు డైటీషియన్లు.. కొన్ని అపోహలు ఉన్నప్పటికీ, చికెన్ సరైన పద్ధతిలో తీసుకుంటే అనేక ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొంటున్నారు.

చికెన్‌లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఆకలిని పెంచుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. చికెన్‌లోని నియాసిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. నియాసిన్ లేకపోతే చికెన్ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. పెప్పర్‌తో కూడిన చికెన్ సూప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఎదిగే పిల్లలకు చికెన్ అందించడం వల్ల అందులోని అమినో యాసిడ్స్ వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి. సెలీనియం కీళ్ల నొప్పులను నివారిస్తుండగా, B5 లేదా పాంటోథెనిక్ ఆమ్లం ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. B6 అధికంగా ఉండటం వల్ల చికెన్ గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆడవారిలో ఋతుక్రమ సమస్యలను కూడా చికెన్ తగ్గించగలదు.

అయితే, ఈ ప్రయోజనాలను పొందాలంటే చికెన్‌ను కొనుగోలు చేయడం దగ్గర నుండి వండటం వరకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తాజా చికెన్‌ను మాత్రమే కొనాలి. చికెన్‌ను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత శుభ్రపరచడంలోనే సగం ఆరోగ్యం దాగి ఉంది. చికెన్‌ను నేరుగా ట్యాప్ కింద లేదా సింక్‌లో పెట్టి కడగకూడదు. అలా చేయడం వల్ల చికెన్‌లోని నీరు, చిన్న కణాలు చుట్టూ పడి, క్యాంప్లోబ్యాక్టర్, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందుతాయని ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ కౌన్సిల్ ప్రపంచ ప్రజలను హెచ్చరిస్తోంది.

ఈ ప్రమాదాన్ని నివారించడానికి, చికెన్‌ను ఒక బౌల్‌లోకి తీసుకుని, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి నీటితో శుభ్రం చేయాలి. ఆ నీటిని సింక్‌లో చిమ్మకుండా, జాగ్రత్తగా మరోచోట పారవేయాలి. ఇలా ఒకటి లేదా రెండుసార్లు చేయడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు.

వండేటప్పుడు ఈ జాగ్రత్తలు అవసరం..

చికెన్ వండేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఉల్లిపాయ ముక్కలను సరిగ్గా వేయించాలి. అప్పటికప్పుడు తయారుచేసిన అల్లం, వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వాడటం మంచిది. చికెన్ బాగా ఉడకడానికి తగినంత నీరు వేయాలి. వండటానికి ముందు అన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల హడావిడి లేకుండా వండవచ్చు. ఇలా సరైన జాగ్రత్తలతో వండిన చికెన్ ఎటువంటి అనర్థాలను కలిగించదు. కొంతమంది చికెన్‌ను వండి ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచి తింటారు.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పటికప్పుడు వండుకుని తినడమే శ్రేయస్కరమని డైటీషియన్లు చెబుతున్నారు.

చికెన్‌ను ఎక్కువగా లేదా ప్రతిరోజూ తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చికెన్ అధికంగా తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె సమస్యలు, హైపర్ టెన్షన్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ కొవ్వు రూపంలో నిల్వ ఉండి, త్వరగా బరువు పెరగడానికి కారణమవుతుంది.

కొన్ని వాణిజ్య చికెన్ రకాలు.. అంటే ఫ్రిజర్, నిల్వ ఉంచిన చికెన్ వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. తరుచూ చికెన్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగి కిడ్నీలో రాళ్లు, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, చికెన్‌ను మితంగా, సరైన జాగ్రత్తలతో శుభ్రపరిచి, వండుకుని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us