Beauty Kitchen Tips: అందానికి వంటింటి వ్యర్థాలు.. అరటి తొక్క నుంచి బియ్యం నీళ్ల వరకు..

|

Aug 10, 2024 | 6:37 PM

ప్రతిరోజూ మనం బియ్యం కడిగిన నీళ్లను, అలాగే వాడిన తర్వాత పారేసే కొన్ని పండ్లు, కూరగాయల తొక్కలను అద్భుతమైన సౌందర్య సాధనంగా వాడుకొచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇవి కొన్ని సహజ సౌందర్య ప్యాక్‌లుగా పనిచేసే పోషకాలతో నిండి ఉన్నాయని చాలా మందికి తెలియదు. మీ ముఖ సౌందర్యం, ఫేస్‌లో మెరిసే గ్లోతో మీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి పదార్థాలను భేషుగ్గా ఉపయోగించువచ్చు.

Beauty Kitchen Tips: అందానికి వంటింటి వ్యర్థాలు.. అరటి తొక్క నుంచి బియ్యం నీళ్ల వరకు..
Kitchen Leftovers
Follow us on

మనలో చాలా మందికి రోజూ పండ్లు తినే అలవాటు ఉంటుంది. అయితే, పండు తిన్న తర్వాత తొక్కను పారేస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇక్కడ కొన్ని పండ్లు, కూరగాయలను ఉపయోగించిన తర్వాత వాటి తొక్కలను పారేసే బదులు వాటితో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ఇది వాస్తవం అంటున్నారు. అలాంటి పండ్లు, కూరగాయల తొక్కలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతిరోజూ మనం బియ్యం కడిగిన నీళ్లను, అలాగే వాడిన తర్వాత పారేసే కొన్ని పండ్లు, కూరగాయల తొక్కలను అద్భుతమైన సౌందర్య సాధనంగా వాడుకొచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇవి కొన్ని సహజ సౌందర్య ప్యాక్‌లుగా పనిచేసే పోషకాలతో నిండి ఉన్నాయని చాలా మందికి తెలియదు. మీ ముఖ సౌందర్యం, ఫేస్‌లో మెరిసే గ్లోతో మీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి పదార్థాలను భేషుగ్గా ఉపయోగించువచ్చు.

వ్యర్థాలుగా విసిరే బదులు ఇలా వాడండి…

ఇవి కూడా చదవండి

బియ్యం నీరు: బి విటమిన్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉన్న రైస్ వాటర్‌లో పొటాషియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీరు అనేది కొరియన్ బ్యూటీ సీక్రెట్ అంటారు. అందుకే ఈ నీటిలో బోలేడు చర్మ సంరక్షణ ప్రయోజనాలు దాగివున్నాయి.

ఇందుకోసం బియ్యాన్ని 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఈ నీటిలో దాని పోషకాలన్నీ గ్రహించేలా చేస్తుంది. మీరు ఈ ద్రవాన్ని 1 నుండి 2 రోజులు ప్రత్యేక కంటైనర్‌లో పులియబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ మిశ్రమాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది. ఆ తరువాత ఈ నీటితో మీ జుట్టును వాష్‌ చేయడానికి ఉపయోగించండి. లేదంటే, ఒక స్ర్పె బాటిల్‌లో వేసుకుని ముఖానికి స్ర్పె చేసుకోవాలి. సుమారు 10 నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే, మీ జుట్టు, చర్మం నిగారింపులో మార్పును చూస్తారు.

అరటి తొక్క: పొటాషియం అధికంగా ఉండే ఈ పండు తొక్కను ముఖ సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. అరటి తొక్కను చెత్తబుట్టలో విసిరే ముందు దాని పొట్టులోని తెల్లటి పదార్థాన్ని మీ ముఖంపై సున్నితంగా రుద్దండి. సుమారు 15 -20 తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అరటి పండులో సహజసిద్ధమైన ఎంజైమ్‌లు ఉన్నందున, మీరు సహజంగా మృత చర్మ కణాలను తొలగించగలుగుతారు. దీంతో మీ ముఖం గ్లో పెరుగుతుంది.

బంగాళదుంప తొక్క: బంగాళదుంపలు ప్రతి వంటింట్లో ఉపయోగించే ప్రధానమైన కూరగాయ. పరాటాలు, ఫ్రైస్ నుండి కూరల వరకు వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. అలాంటి బంగాళాదుంపలు ఫ్లేవనాయిడ్లు, ఫినాల్స్, గ్లైకోఅల్కలాయిడ్స్ స్టోర్హౌస్, చర్మ ఆరోగ్యానికి అద్భుతాలు చేసే అన్ని సమ్మేళనాలు నిండివున్నాయి.

ఈ కూరగాయల తొక్కలు ముఖ చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. మీరు బంగాళాదుంప తొక్కలను నేరుగా మీ చర్మంపై మసాజ్‌ చేసుకోవచ్చు. మీకు అలెర్జీ లేకుంటే వాటిని పేస్ట్‌గా కూడా రుబ్బుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు.

దోసకాయ పొట్టు: తినే ముందు దోసకాయ పీల్ చేసి తింటుంటాం..తరువాత ఆ తొక్కను పారేసే బదులు ముఖానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం..దోసకాయ తొక్కను నేరుగా, లేదంటే, మెత్తటి మిశ్రమంగా చేసుకుని ముఖానికి ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. దోసకాయ తొక్కలతో అకాల వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, ఫ్రీ రాడికల్స్ నుండి బయటపడటానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. దోసకాయ తొక్కలో మెగ్నీషియం, పొటాషియం, సిలికా వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖం ఛాయ, దృష్టిని మెరుగుపరుస్తుంది.

పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్, సెల్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. మీరు ఇంట్లో పుల్లగా మారిన పెరుగు మిగిలిపోతే… దానిని పారేయకండి.. బదులుగా, నల్ల మచ్చలను తొలగించడానికి, హైపర్-పిగ్మెంటేషన్‌ ట్రీట్మెంట్‌ కోసం ఉపయోగించవచ్చు. పెరుగు మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చుండ్రుని తొలగించి, మీ స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొంత మంది చర్మంపై ఇలాంటివి అప్లై చేసిన సమయంలో అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఉపయోగించే సమయంలో ముందుగా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..