Chilli Chicken: చల్లటి వెదర్‌లో హాట్‌హాట్‌ చిల్లీ చికెన్‌.. ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్‌..

|

Sep 01, 2024 | 10:04 AM

ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మబ్బు మసకేయడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి ఉంది. అసలే ఆదివారం, పైగా భారీ వర్షం.. ఇంట్లో హాయిగా సేద తీరుతున్నారు. అయితే ఇలాంటి కూల్ వెదర్‌లో హాట్‌హాట్‌గా ఏదైనా లాగించేస్తే భలే ఉంటుంది కదూ. మరి ఈ కూల్ వెదర్‌లో హాట్‌ హాట్‌గా ఉండే చిల్లి చికెన్ తింటుంటే...

Chilli Chicken: చల్లటి వెదర్‌లో హాట్‌హాట్‌ చిల్లీ చికెన్‌.. ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్‌..
Chilli Chicken
Follow us on

ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మబ్బు మసకేయడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి ఉంది. అసలే ఆదివారం, పైగా భారీ వర్షం.. ఇంట్లో హాయిగా సేద తీరుతున్నారు. అయితే ఇలాంటి కూల్ వెదర్‌లో హాట్‌హాట్‌గా ఏదైనా లాగించేస్తే భలే ఉంటుంది కదూ. మరి ఈ కూల్ వెదర్‌లో హాట్‌ హాట్‌గా ఉండే చిల్లి చికెన్ తింటుంటే ఆ మజానే వేరు కదూ. అయితే చిల్లి చికెన్‌ అనగానే ముందుగా రెస్టారెంట్ గుర్తొస్తుంది. కానీ ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్‌ వచ్చేలా చిల్లీ చికెన్‌ను రడీ చేసుకుంటే. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇంతకీ రెస్టారెంట్ స్టైల్లో చిల్లి చికెన్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో.? ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా బోన్‌ లెస్‌ చికెన్‌ను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, రుచికి సరిపడ ఉప్పు, గరం మాసాలా వేసుకొని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్‌లో బాగా బీట్‌ చేసిన కోడి గుడ్డును వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం మైదా, కార్న్‌ ఫ్లోర్‌ వేయాలి. మీరు చికెన్‌ తీసుకున్న క్వాంటిటికీ అనుగుణంగా వీటిని కలుపుకోవాలి. కొంచెం నీరు పొసుకుంటూ కలుపుకోవాలి.

తర్వాత బాణీలో నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్‌ను ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించాలి ఇలా చేయడం వల్ల ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా వేయించిన చికెన్‌ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.

అనంతరం మరో పాన్‌ తీసుకొని కొంత నూనె వేసుకొని వేడి చేయాలి. అనంతరం అందులో పచ్చిమిర్చి, వెల్లులి, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేసుకోని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో నీరుపోసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి, అజినామోటో, సోయా, చిల్లీ సాస్‌ వంటివి వేసుకోవాలి. జ్యూసీ జ్యూసీగా అయిన తర్వాత అంతకు ముందు రడీ చేసుకొని పెట్టుకున్న చికెన్‌ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. కాసేపటి తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. అంతే రుచికరమైన చిల్లి చికెన్‌ రడీ అయినట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..