Telugu News Lifestyle Personality Test: Your sitting positions reveals these personality traits in telugu
Personality Test: కూర్చున్న విధానం కూడా వ్యక్త్విత్వం తెలియజేస్తుంది.. కాళ్ళు ఎలా పెట్టుకుంటే ఎలాంటి నడవడిక ఉన్నవారంటే..
సాధారణంగా వ్యక్తిత్వం వ్యక్తికి వ్యక్తికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా తెలుసుకోవాలంటే.. మీరు వారితో కలిసి ఉండాలి. అయితే నిలబడి ఉన్న భంగిమ, ముక్కు ఆకారం, జుట్టు రంగు, వేళ్ల ఆకృతిని బట్టి కూడా వ్యక్తి వ్యక్తిత్వం, నడవడికను అంచనా వేయవచ్చు. అంతే కాదు కూర్చున్న భంగిమను బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. ఈ రోజు కూర్చున్న భంగిమ ఆధారంగా అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి సమాజం విలువనిస్తుంది. పడుకునే భంగిమ, ముక్కు ఆకారం, నడక శైలిని బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చునని అందరికీ తెలుసు. అయితే మీరు కూర్చున్న తీరును బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. వ్యక్తి జీవన శైలి, నడవడిక మనిషి లక్షణాలను బహిర్గతం చేస్తుంది.
స్ట్రెయిట్ సిట్టర్స్: తమ మోకాళ్లను నిటారుగా ఉంచుకునే వ్యక్తులు తమ సామర్ధ్యాలు, నైపుణ్యాలపై మరింత నమ్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులలో అభద్రతా భావం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ భంగిమలో కూర్చున్న వ్యక్తులు తెలివైనవారు. హేతుబద్ధంగా ఆలోచిస్తారు. సమయపాలన పాటిస్తారు. తన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ఓ అడుగు ముందుంటారు. చాలా ఓపికగా ఉంటారు. క్లిష్ట పరిస్థితులను కూల్‌గా నిర్వహిస్తారు. నిజాయితీపరులు.. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటానికి ఇష్టపడరు.
మోకాళ్లను విడదీసి కూర్చునే వ్యక్తులు: మోకాళ్లను వెడల్పుగా ఉంచి కూర్చునే వారు స్వార్థపరులు. వీరు తమ గురించి తామే ఎక్కువగా ఆలోచించుకుంటారు. అహంకారంతో ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. సాధించాలనే తపన ఉన్నా.. అపజయం భయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. ఏ పని మీదా దృష్టి పెట్టరు. దీంతో చేపట్టిన పనులు సగంలో నిలిచిపోతాయి. తెలివైనవిగా ఆలోచనలు చేస్తారు. అసంబద్ధమైనవిగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు కూడా విసుగు చెందుతారు. కనుక వీరిని ఓదార్చడానికి ఎవరైనా అవసరం. పని పరంగా ఎవరైనా ఈ వ్యక్తులను ప్రోత్సహించాలి.
కాళ్ల మీద కాళ్లు పెట్టుకుని కూర్చునేవాళ్లు: చాలా మందికి కాలు వేసుకుని కూర్చోవడం అలవాటు. ఈ వ్యక్తులు సృజనాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు. అయితే కలలు కనడంలో వీరిని ఎవరూ మించలేరు. ఈ వ్యక్తులు గౌరవప్రదంగా జీవిస్తారు. తమ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో వీరికి బాగా తెలుసు. సలహాలు, సూచనలు ఇస్తూ అందరికి దగ్గరవుతారు.
మడమలు ఒకదానిపై ఒకటి పెట్టుకునేవారు: కాళ్ళు ఎడమగా మడమల మీద మడమలు పెట్టుకునే వారు ఏ పని చేయడానికి అయినా పరిస్థితిని అంచనా వేస్తారు. వీరు సొంత ఆలోచన ప్రకారం పరిస్థితులు అంచనా వేస్తారు, వీరి భావాలు చాల సున్నితంగా ఉంటాయి. వీరికి ఇతర వ్యక్తుల మద్దతు అవసరం. ఈ భంగిమలో కూర్చునే వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఈ భంగిమ సౌఖ్యాన్ని సూచిస్తుంది. ఈ కుర్రాళ్ళు తమ చుట్టూ ఉన్నవారిలో విశ్వాసాన్ని నింపుతారు మరియు జెడ్‌తో సహా అందరి మాటలను వింటారు. ఎల్లప్పుడూ పని మరియు విశ్రాంతి లేదు. మరింత ప్రతిష్టాత్మకమైనది.
మోకాళ్లపై కాళ్లు పెట్టుకుని కూర్చునేవాళ్లు : ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆత్మవిశ్వాసంతో కూడిన నడక సంతృప్తి , భద్రతను పెంచుతుంది. వీరికి ఏదైనా కావానుకుంటే దాని కోసం తీవ్రంగా ప్రయత్నించే వైఖరిని కలిగి ఉంటారు. వీరు తెలివైన, కష్టపడి పనిచేసే యువకులు, వృత్తి జీవిటానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.