Peanut Pulao: ఆరోగ్యానికి శనగల పలావు.. మరింత రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందామా..

మనం నిత్యం చేసుకునే వంటల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే వంటలను భారత్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయనే చెప్పుకోవాలి.

Peanut Pulao: ఆరోగ్యానికి శనగల పలావు.. మరింత రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందామా..
Peanut Pulav

Updated on: Mar 13, 2021 | 2:04 PM

మనం నిత్యం చేసుకునే వంటల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే వంటలను భారత్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయనే చెప్పుకోవాలి. శనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే వాటితో పిల్లలు, పెద్దవారు ఇష్టపడి తినేలా శనగల పలావు ఏలా రెడి చేయాలో తెలుసుకుందామా..

కావల్సిన పదార్థాలు..

బాస్మతి బియ్యం – 400గ్రా
తెల్ల కాబూలీ శనగలు – 100గ్రా.
కొబ్బరి – సగం చిప్ప
పచ్చిమిరపకాయలు – 4
పంచదార – ఒక టీస్పూన్‌
లవంగాలు – 4
కొత్తిమీర – ఒక కట్ట
నూనె – ఆరు టీస్పూన్
ఎండు మెంతి ఆకులు – ఒక టీస్పూన్‌
గరం మసాలా పొడి – రెండు టీస్పూన్స్
ఉప్పు-తగినంత
దాల్చిన చెక్క – రెండు అంగుళముల ముక్క
యాలకులు – 5లేక 6
చిరంజి ఆకులు – 2
నెయ్యి – 5 టీస్పూన్స్
పెద్దసైజు టమాటాలు – 6
వెల్లుల్లి – 15 పాయలు
సాంబారు ఉల్లిపాయలు -100గ్రా

తయారీ విధానం..

ముందుగా సాంబారు ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తురిమిన పచ్చికొబ్బరి కలిపి రుబ్బి పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణాలిలో రెండు టీస్పూన్ల నూనే వేసి అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఆ తర్వత తురిమిన కొబ్బరి కలిపి మళ్లీ మెత్తగా రుబ్బుకోవాలి. శనగలను దాదాపు పది గంటలు నాననివ్వాలి. అలాగే బియ్యాన్ని కూడా పది నిమిషాలు నానబెట్టాలి. బియ్యం నుంచి నీళ్ళను వేరుచేసి.. నూనే వేసి బియ్యం తడి పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత కుక్కర్లో శనగలు వేసి పావుగంటసేపు ఉడికించాలి. అలాగే టమాటాలను కూడా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. చల్లారిన టమాటాలను రుబ్బుకోవాలి. కొబ్బరి తురుమును నీళ్ళు, కొబ్బరిపాలు కలిపి ఉంచాలి. ఆ తర్వాత ఒక బాణాలిలో నూనే వేడి చేసి.. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, చిరంజీ ఆకులు, వెల్లుల్లి వేసి వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయాలు వేసి.. రుబ్బిన మసాలా వేసి సన్నటి మంటపై వేయించాలి. అందులోనే టమాట ముద్ద, కస్తూరి మెంతి, ఉప్పు, పంచదార, మసాలా పొడిచేసి కొంచెం చేసి ఉడికించాలి. అలాగే ఉడికిన శనగలు, కొబ్బరి పాలు వేసి అవి పైకి తెలాక బియ్యం పోసి బాగా కలపాలి. ఒక పల్లెంలో గట్టిగా మూసి దానిపై బరువు పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, జీడిపప్పు అలంకరించాలి.

Also Read:

ఈ ఎండాకాలంలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉండేందుకు ఈ దుస్తులను ధరించండి..