Thyroid:  థైరాయిడ్ సమస్య వేధిస్తోందా? రాత్రి వేళ ఈ ఆహారంతో చెక్ పెట్టొచ్చు.. నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి..

|

Feb 14, 2023 | 11:00 AM

ప్రముఖ పోషకాహార నిపుణురాలు లోవనీత్‌ బాత్రా దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీపై పోస్ట్‌చేసిన వీడియోలో రాత్రి వేళ నిద్ర పోయే సమయంలో పాటించవలసిన కొన్ని ఆహార నియమాలు, చిట్కాలు తెలియజేస్తున్నారు.

Thyroid:  థైరాయిడ్ సమస్య వేధిస్తోందా? రాత్రి వేళ ఈ ఆహారంతో చెక్ పెట్టొచ్చు.. నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి..
Thyroid
Follow us on

ప్రస్తుతం సమాజంలో చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ ఒక దీర్ఘ కాలిక సమస్య. మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీదా ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపో థైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపో థైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా అయిదు రెట్లు అధికంగా ఉంది. అయితే దీనిని మనం తీసుకొనే ఆహారం కూడా నియంత్రించగలుతుందని నిపుణులు చెబుతున్నారు. మన రోజూ వారీ ఆహారంలో లభించే అనేక పోషకాలు థైరాయిడ్‌ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయని వివరిస్తున్నారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు లోవనీత్‌ బాత్రా దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీపై పోస్ట్‌చేసిన వీడియోలో రాత్రి వేళ నిద్ర పోయే సమయంలో పాటించవలసిన కొన్ని ఆహార నియమాలు, చిట్కాలు తెలియజేస్తున్నారు. సరైన సమయంతో నాణ్యమైన నిద్ర థైరాయిడ్‌ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుందని చెబుతున్నారు. ఆ ఆహార నియమాలు ఏంటో చూద్దాం..

4 నుంచి 5 నానబెట్టిన జీడిపప్పు తీసుకోవాలి.. జీడిపప్పులో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును నిర్ధారించడంలో, థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా థైరాయిడ్ కణజాలాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

రెండు కొబ్బరి ముక్కలు.. కొబ్బరిలో అధిక స్థాయి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జీవక్రియను ప్రోత్సహిస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మెరుగైన థైరాయిడ్ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

ఒక టీ స్పూన్‌ నానబెట్టిన చియా విత్తనాలు.. చియా విత్తనాల్లో ఒమేగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి హషిమోటోస్ థైరాయిడిటిస్, డిక్వెర్వైన్స్ థైరాయిడిటిస్ లేదా ఇతర రకాల థైరాయిడిటిస్ వంటి పరిస్థితుల నుంచి థైరాయిడ్ గ్రంధిలో రక్షించడంలో సాయపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ కాల్చిన గుమ్మడికాయ గింజలు.. గుమ్మడికాయ గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఆరోగ్యానికి కీలకంగా పనిచేస్తుంది. అలాగే, గుమ్మడికాయ గింజలు నిద్రను ప్రోత్సహించే అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ కు కూడా కలిగి ఉంటాయి. అలాగే గుమ్మడికాయ గింజలలోని జింక్, కాపర్, సెలీనియం నిద్ర వ్యవధి, నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..