
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఒత్తిడి కారణంగా చర్మంపై చిన్న వయస్సులోనే ముడతలు రావడం, నల్లటి మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. వీటిని పోగొట్టుకోవడానికి రసాయనాలతో కూడిన క్రీములు వాడటం కంటే, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే లభించే సహజ వస్తువులతో మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ముఖంపై మొటిమలు, ఎండ ప్రభావం లేదా వయస్సు రీత్యా వచ్చే నల్లని మచ్చలను తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన వస్తువులు అద్భుతంగా పనిచేస్తాయి. అదేలాగో ఇక్కడ చూద్దాం..
అవసరమైన పదార్థాలు: ఒక టీస్పూన్ కాఫీ పొడి (ఏదైనా బ్రాండ్), అర చెక్క నిమ్మరసం లేదా కొద్దిగా పెరుగు (సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు పెరుగు వాడవచ్చు)
తయారీ మరియు వాడే విధానం: ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడిని తీసుకోండి. అందులో తగినంత నిమ్మరసం లేదా పెరుగు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయండి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగంలో సమానంగా పట్టించాలి. 15 నుండి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత, వేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఉండే మృతకణాలను (Dead Cells) తొలగించి, రక్త ప్రసరణను పెంచుతుంది. దీనివల్ల ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి నల్లని మచ్చలను తేలికపరిచి చర్మానికి మంచి రంగును ఇస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ సహజ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే ఫలితాల కోసం కొంత ఓపిక అవసరమని మర్చిపోవద్దు. ఖరీదైన ఫేషియల్స్ కంటే ఇలాంటి సహజమైన పద్ధతులు చర్మానికి ఎంతో సురక్షితమైనవి. అయితే, ఈ చిట్కాలను పాటించేటప్పుడు ఎండలోకి వెళ్లేముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ఏదైనా ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..