నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్.. ఒక్క గ్లాస్ తాగితే.. రోజంతా
ఈ దసరా నవరాత్రులకు చాలా మంది ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో చాలా మంది అలసిపోతుంటారు. అయితే ఉపవాస వేళల్లో నీరసం రాకుండా ఉదయాన్నే కడుపు నింపే హెల్తీ అల్పాహారం కోసం ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ ఒక అదిరిపోయే రెసిపీని పంచుకున్నారు. అదే నోరూరించే క్రీమీ బొప్పాయి స్మూతీ. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

నవరాత్రి వ్రతం ఆచరించే భక్తులకు ఉపవాస సమయంలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే తేలికైన, పౌష్టికాహారం ఎంతో అవసరం. ఉదయం పూట సులభంగా, రుచికరంగా చేసుకునే అల్పాహారం కోసం ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ ఒక ప్రత్యేకమైన బొప్పాయి స్మూతీ రెసిపీ గురించి చెప్పారు. పండిన బొప్పాయి, పెరుగు లేదా చల్లని పాలు, యాలకుల సువాసనతో తయారయ్యే ఈ క్రీమీ డ్రింక్ శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ఈ హెల్తీ డ్రింక్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
బొప్పాయి స్మూతీకి కావాల్సిన పదార్థాలు
- పండిన బొప్పాయి ముక్కలు: 1 కప్పు
- పెరుగు లేదా చల్లని పాలు: 1 కప్పు
- తేనె లేదా మిశ్రీ : 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి: చిటికెడు
- సైంధవ లవణం: చిటికెడు
- ఐస్ క్యూబ్స్: 4 నుంచి 5
- డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు లేదా పిస్తా పలుకులు
బొప్పాయి స్మూతీ తయారుచేయు విధానం:
- ముందుగా పండిన బొప్పాయిని శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- బ్లెండర్ జార్‌లో బొప్పాయి ముక్కలు, తాజా పెరుగు లేదా చల్లని పాలు, తేనె లేదా మిశ్రీ, చిటికెడు యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ వేయాలి.
- ఈ మిశ్రమాన్ని 1 నుంచి 2 నిమిషాల పాటు చిక్కగా, క్రీమీగా మారేంత వరకు బాగా బ్లెండ్ చేయాలి.
- తర్వాత ఆ చల్లని స్మూతీని గ్లాసులో పోసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొప్పాయి స్మూతీ రెడీ అయినట్టే
పర్ఫెక్ట్ స్మూతీ కోసం
అయితే ఈ పర్ఫెక్ట్ స్మూతీ రావాలంటే సహజ తీపి ఎక్కువగా ఉండే పండిన బొప్పాయిని ఎంచుకుంటే అదనపు చక్కెర అవసరం లేకుండా స్మూతీ రుచి అద్భుతంగా వస్తుంది. అలాగే తేలికపాటి డ్రింక్ కావాలనుకుంటే పాలు, బాగా క్రీమీగా ఉండాలంటే చిక్కటి పెరుగును వాడటం మంచిది. అంతేకాదు ఇందులో వేసే యాలకుల పొడి బొప్పాయికి సరికొత్త ఫ్లేవర్‌ను జోడిస్తుంది. పైన డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల స్మూతీ తాగేటప్పుడు మంచి టెక్చర్ లభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
