మొటిమలు, నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వారానికి రెండుసార్లు ఇలా చేయండి

ముఖం తాజాగా మెరిసిపోవాలంటే లోపల నుంచి శుభ్రంగా ఉండాలి. రోజూ బయటకు వెళ్లే సమయంలో ముఖంపై దుమ్ము, మురికి చేరుతాయి. ఇవి చర్మాన్ని నిస్తేజంగా చేస్తాయి. స్క్రబ్బింగ్ చేస్తే ఈ మురికిని లోతుగా శుభ్రం చేయొచ్చు. చర్మం మీద ఉన్న మృత కణాలు పోతాయి. దీంతో ముఖం సహజంగా మెరిసిపోతుంది.

మొటిమలు, నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వారానికి రెండుసార్లు ఇలా చేయండి
Glowing Skin

Updated on: May 06, 2025 | 2:55 PM

స్క్రబ్ చర్మపు రంధ్రాల్లో చేరిన మురికిని బయటకు తీయడంలో సహాయపడుతుంది. ఇలా చేయటం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కానీ స్క్రబ్ చేయడం సరిగా తెలియకపోతే చర్మానికి హాని కలుగుతుంది. అందుకే దాన్ని సాఫీగా, నెమ్మదిగా ఉపయోగించాలి.

ఎటువంటి స్క్రబ్‌ ను ఉపయోగిస్తున్నామో గమనించాలి. గట్టిగా ఉండే స్క్రబ్‌లు చర్మాన్ని గాయపరిచే అవకాశం ఉంది. చాలా మంది ఇంట్లో ఉన్న పదార్థాలతో స్క్రబ్ తయారు చేసుకుంటారు. ఇవి సహజమైనవి కాబట్టి దుష్ప్రభావాలు ఉండవు. ఇలా మార్కెట్ స్క్రబ్‌లు ఉపయోగించకుండా ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిది.

పండ్లు స్క్రబ్ చేయటానికి బాగుంటాయి. వీటిలో సహజ గుణాలు ఉంటాయి. కివీ, నిమ్మకాయ, నారింజ వంటివి ముఖానికి మంచివి. ఈ పండ్ల గుజ్జులో పాలు కానీ క్రీమ్‌ కానీ కలిపి ముఖంపై అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గులాబీ రేకులు ఎండబెట్టి రుద్దినా స్క్రబ్ తయారవుతుంది. మందార పువ్వులు ఎండబెట్టి, తేనె కలిపి స్క్రబ్ చేయొచ్చు. బాదం తేనెతో తయారు చేసిన స్క్రబ్ పొడి చర్మానికి బాగా ఉపయోగపడుతుంది.

స్క్రబ్ వల్ల మెరుగైన శుభ్రత లభిస్తుంది కానీ రోజూ చేస్తే చర్మానికి మేలు కాదు. వారానికి రెండు సార్లు చాలు. స్క్రబ్ చేసే సమయంలో ముఖాన్ని తేలికగా రుద్దాలి. బలంగా రుద్దితే చర్మం దెబ్బతింటుంది. సున్నితంగా చేయడం వల్ల మాత్రమే గ్లో కనిపిస్తుంది.

ప్రతి వ్యక్తి చర్మం తేడాగా ఉంటుంది. పొడి, నార్మల్, జిడ్డు చర్మాలకు వేర్వేరు రకాల స్క్రబ్‌లు అవసరం. సున్నితమైన చర్మం ఉన్నవారు నిపుణుల సలహా తీసుకోవాలి. కొంతమంది స్క్రబ్ వాడకపోవడమే మంచిది. చర్మానికి ఏది తగినదో తెలుసుకొని దాన్ని మాత్రమే వాడాలి.

ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉంటే నిమ్మరసం, సముద్రపు ఉప్పుతో స్క్రబ్ తయారు చేయొచ్చు. కొద్దిగా ఉప్పు తీసుకొని నిమ్మరసం కలిపి ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఒకటి రెండు నిమిషాల తరువాత కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది.

ఈ విధంగా సరైన స్క్రబ్బింగ్, సరైన పదార్థాలు ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. మీరు ఏ చర్మ రకం కలవారైనా.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సహజ కాంతి పొందవచ్చు.