Mutton: మటన్‌లోని ఈ పార్ట్‌తో ఫుల్ పవర్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆ రోగాలకు దడ దడే..

మటన్ గుండె (Mutton Heart) అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ప్రోటీన్, ఒమేగా-3, విటమిన్ B12, ఐరన్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది.. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అయితే, దీనిలో కొలెస్ట్రాల్, కొవ్వు అధికంగా ఉంటుంది.. కావున మితంగా తీసుకోవడం ముఖ్యం.. మేక గుండెకాయ తింటే కలిగే ప్రయోజనాలు, ఎవరు తినకూడదు అనే విషయాలను తెలుసుకుందాం..

Mutton: మటన్‌లోని ఈ పార్ట్‌తో ఫుల్ పవర్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆ రోగాలకు దడ దడే..
Mutton Heart

Updated on: Jan 16, 2026 | 3:50 PM

మటన్.. మేక మాంసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అంతేకాకుండా.. మేక తల, లివర్, మటన్ హార్ట్, కాళ్లు ఇలా అన్ని పార్ట్స్ లో దేనికదే స్పెషల్.. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి.. వాటిని తినడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.. ఇవన్నీ పలు సమస్యల నివారణకు సహాయపడతాయని డైటీషియన్లు చెబుతున్నారు. వాస్తవానికి పండుగ వేళ, అలాగే.. ఆదివారంతోపాటు.. అన్ని వేళల్లో కూడా చాలా మంది మాంసాహారాన్ని ఇష్టపడతారు. ఈ మాంసాహారంలో కొందరు మేక గుండెకాయ (Mutton Heart) ను తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. మేక గుండెకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దానిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

మేక గుండెకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. ఇందులో ఉండే అధిక నాణ్యత గల ప్రోటీన్ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, కండరాల అభివృద్ధికి, మరమ్మత్తుకు కీలక పాత్ర పోషిస్తుంది. శారీరక శ్రమ చేసేవారికి, ఆరోగ్యకరమైన కండరాలను కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆహార వనరు.

మేక గుండెకాయ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆమ్లాలు మానవ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, మొత్తం శరీర ధృడత్వానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి

ఇందులో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B12 నాడీ వ్యవస్థ సరైన పనితీరుకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఇది కండరాల పనితీరును మెరుగుపరచి, మొత్తం నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మేక గుండెకాయలో ఐరన్ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల అనీమియా (రక్తహీనత) వస్తుంది. గుండెకాయలోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, అనీమియాను నివారించడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా, గుండెకాయలో ఉండే ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యం.. శక్తి ఉత్పత్తికి అవసరం కాగా, జింక్ రోగనిరోధక శక్తిని పెంచి, కణాల పెరుగుదల.. మరమ్మత్తుకు తోడ్పడుతుంది.

మటన్ హార్ట్ ను ఎవరు తినకూడదు..

అయితే, మేక గుండెకాయను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మాంసంలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, సంతృప్త కొవ్వులు కూడా గుండె ఆరోగ్యానికి అంత మంచివి కావు. గుండెకాయను వండుకునే ముందు పద్ధతిగా శుభ్రపరచడం చాలా ముఖ్యం. సరిగ్గా శుభ్రపరచకపోతే బ్యాక్టీరియా లేదా పారసైట్ సంక్రమణలు కలగవచ్చు.. ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

కొంతమందిలో, ముఖ్యంగా అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడని వారికి, మేక గుండెకాయలోని అధిక కొవ్వు ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు. ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఇబ్బందికరంగా మారవచ్చు.

దీన్ని అధికంగా తినడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, మితిమీరిన మోతాదులో తీసుకోకుండా ఉండడం ఉత్తమం. మొదటిసారి మేక గుండెకాయను తినే ముందు లేదా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. కొందరికి మేక గుండెకాయను తినడం వల్ల అలర్జీలు లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

మీరు కూడా డైట్‌లో మార్పులు చేసుకోవాలనుకుంటే.. ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే.. డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..