Vitamin D: ఉదయమా.. మధ్యాహ్నమా.. ఏటైంలో సూర్యరశ్మి నుంచి విటమిన్‌ డి ఎక్కవగా పొందవచ్చు!

విటమిన్‌ డి అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యం.. మన శరీరంలో ఈ విటమిన్‌ లోపిస్తే మనం అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మిగతా విటమిన్‌లలా కాకుండా దీన్ని సహజంగా సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. అయినప్పటికీ మన దేశంలో చాలా మంది ఈ విటమిన్‌ను లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం సూర్యరశ్మి నుంచి సరిగ్గా విటమిన్‌ డిని పొందలేకపోవడం.. కాబట్టి ఉదయం లేదా మధ్యాహ్నం ఏ సమయంలో సూర్యరశ్మి నుంచి ఈ విటమిన్‌ను ఎక్కువగా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Vitamin D: ఉదయమా.. మధ్యాహ్నమా.. ఏటైంలో సూర్యరశ్మి నుంచి విటమిన్‌ డి ఎక్కవగా పొందవచ్చు!
Vitamin D

Updated on: Nov 16, 2025 | 10:19 AM

మనం ఆరోగ్యకరమైన విటమిన్ డి స్థాయిలను పొందడంలో సూర్యరశ్మి కీలకంగా వ్యవహరిస్తుంది. దీనితో పాటు మన రోజువారి ఆహారంలో విటమిన్ డి కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఈ రెండూ కలిస్తేనే మనం ఆరోగ్యకరమైన విటమిన్ డిని పొందవచ్చు. చాలా మంది తెల్లవారుజామున వచ్చే సూర్యరశ్మి ద్వారా ఎక్కువ విటమిన్‌ డి పొందవచ్చని నమ్ముతారు. కానీ చర్మంలోని కొలెస్ట్రాల్‌ను విటమిన్ డి3గా మార్చడానికి ఉపయోగపడే నిర్దిష్ట కిరణాలు, అతినీలలోహిత బి కిరణాలు ఉదయం 7 గంటల వరకు భూమిని చేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం సూర్యరశ్మి పూర్తి స్థాయిలో మనకు విటమిన్ డిని అందించలేదని చెబుతున్నారు.

ఏ సమయంలో సూర్యరశ్మి నుంచి విటమిన్ డి పొందవచ్చు

సహజ సంశ్లేషణకు అత్యంత ప్రభావవంతమైన సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉంటుంది, ఆ సమయంలో UVB కిరణాలు బలంగా ఉంటాయి, ప్రతిరోజూ కనీసం పదిహేను నిమిషాలు ఈ సూర్యరశ్మిని అస్వాదించాలని చెబుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఎక్కువ టైం ఇంట్లో లేదా ఆఫీస్‌లో గడపడం, నగరాల్లో అధిక కాలుష్యం, లేతరంగు గల కార్ స్క్రీన్‌లు వంటి లక్షణాల వల్ల సహజ UVB ఎక్స్‌పోజర్ పొందలేమని.. అందువల్లనే సూర్యరశ్మి అధికంగా ఉన్న దేశంలో నివసిస్తున్నప్పటికీ, 80 నుండి 90 శాతం మంది భారతీయులు ఈ విటమిన్ లోపాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

ఆహారం నుంచి విటమిన్‌ డిని పొందండం

మనం విటమిన్ డిని పొందడంలో.. సూర్యరశ్మి ప్రాథమిక సహజ వనరుగా ఉన్నప్పటికీ, ఆహారం కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి తర్వాత ఈ విటమిన్‌ ఎక్కువగా మాంసాహార ఆహార పదార్థాలలో లభిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందుకోసం సాల్మన్, సార్డిన్స్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డు సొనలు, కాలేయం వంటి అవయవ మాంసాలు అద్భుతమైన సహజ వనరులను అందిస్తాయని చెబుతున్నారు. ఇక శాఖహారుల విషయానికి వస్తే పుట్టగొడుగులు, పాలు, పెరుగు, మొక్కల ఆధారిత పాలు, అల్పాహార తృణధాన్యాలు వంటి బలవర్థకమైన ఉత్పత్తులు ఆహారంగా తీసుకోవడం వల్ల విటమిన్‌ డిని పొందవచ్చని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us