
మనీ ప్లాంట్‌ను చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటారు.. ముఖ్యంగా ఈ మొక్క గాలిని శుద్ధి చేయడంతోపాటు.. ఆకర్షవంతంగా ఉంటుంది. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఇండోర్ మొక్కకు అపార ప్రాముఖ్యత కూడా ఉంది.. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ను ఇంటిలో సరైన దిశలో ఉంచడం ద్వారా అదృష్టం, సంపద కలుగుతాయని భారతీయ సంస్కృతిలో బలంగా నమ్ముతారు. అనేకమంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే కలిసివస్తుందని భావిస్తారు. శాస్త్రీయంగా ఈ మొక్క చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుందని, ఇది ఇంట్లో వారికి శక్తిని, అదృష్టాన్ని ఇస్తుందని కొందరు నమ్ముతారు. అయితే, మనీ ప్లాంట్ ను ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే దీనిని ఉంచడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా, ఇంటి ఈశాన్య భాగంలో మనీ ప్లాంట్ ను ఉంచకూడదు. ఈ దిశలో ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువని, ఆర్థికంగా నష్టపోవడం, ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడతారని చెబుతారు. ఈశాన్య దిశలో బరువును కూడా ఉంచకూడదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, మనీ ప్లాంట్ ను కుండీలో లేదా సీసాలో నీటితో నింపి ఉంచాలి. దీనికి రోజూ నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఆవహిస్తుంది.
మనీ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచడం ఉత్తమం. ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కుగా పరిగణిస్తారు.. ఈ దిశలో మొక్కను ఉంచడం వల్ల అదృష్టం కలిగి, ఇంటిలో శుభం కలుగుతుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ ను ఈశాన్య దిశలో ఉంచితే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, ఇల్లు ప్రతికూలంగా మారుతుంది. గణేశుడు ఆగ్నేయ దిశలో మంచిని సూచించే దేవుడు కాబట్టి, ఈ దిశలో నాటడం వల్ల పుణ్యఫలం లభించే అవకాశం ఉంది.
మనీ ప్లాంట్ తీగలు పెరిగే కొద్దీ నేలను తాకకుండా చూసుకోవాలి. తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభసూచకం. మనీ ప్లాంట్లు లక్ష్మీదేవి అభివ్యక్తి అని చెబుతారు, అందుకే వాటిని నేలను తాకకుండా చూసుకోవాలి. ఎండిన, పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే వాస్తు దోషం పడుతుంది. వాస్తు ప్రకారం, ఎండిన మనీ ప్లాంట్ వినాశనానికి సంకేతం, ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిని నివారించడానికి రోజూ నీరు పోస్తూ, ఎండిన ఆకులను కత్తిరించి తొలగించాలి.
మనీ ప్లాంట్ ను ఎల్లవేళలా ఇంటి లోపల ఉంచాలి. దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు. ఇంటి బయట మనీ ప్లాంట్ నాటడం వాస్తు ప్రకారం దురదృష్టకరం, ఎందుకంటే ఇది ఎండకు త్వరగా ఎండిపోయి, పెరుగుదలలో క్షీణతకు దారితీస్తుంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చు. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్లను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. అలా ఇస్తే శుక్ర గ్రహానికి కోపం వస్తుందని, శుక్రుడు సంపద, శ్రేయస్సుకు దేవత కాబట్టి, ఈ మొక్కను ఇతరులకు ఇవ్వడం వల్ల బహుమతులను, సంపదను కోల్పోతారని నమ్ముతారు.
భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఆర్థిక పురోగతి ఇంటి తూర్పు, ఈశాన్య దిశలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశల్లో ఏదైనా వాస్తుదోషం ఉంటే ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..