Glowing Skin: మచ్చలు లేని మెరిసే చర్మం కోసం తేనెతో ఫేస్‌ప్యాక్.. యవ్వనంగా కనిపిస్తారు..

తేనె చర్మ కణాలను రిపేర్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటాయి. ఇవి చర్మం నుండి మచ్చలను తొలగిస్తాయి. ఇది మీరు వయసు పెరిగే కొద్దీ కూడా యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. ముఖం నుండి మచ్చలను తొలగించడానికి తేనెను ఎలా ఉపయోగించాలి..? తేనెతో ఏ పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేయాలి? దీని గురించి తెలుసుకుందాం.

Glowing Skin: మచ్చలు లేని మెరిసే చర్మం కోసం తేనెతో ఫేస్‌ప్యాక్.. యవ్వనంగా కనిపిస్తారు..
Honey For Spotless Skin

Updated on: Dec 03, 2025 | 5:25 PM

ప్రతి ఒక్కరూ వయసు పైబడినా తమ ముఖం మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం అనేక సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని ఖరీదైన సాధానాలేవీ ఈ సమస్యను నివారించలేవు. కానీ, ముఖం నుండి మొండి మచ్చలను తొలగించడంలో కొన్ని ప్రత్యేక నివారణలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది తేనెతో కలిసి తయారు చేసుకోవాలి. నిజానికి తేనె చర్మ కణాలను రిపేర్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటాయి. ఇవి చర్మం నుండి మచ్చలను తొలగిస్తాయి. ఇది మీరు వయసు పెరిగే కొద్దీ కూడా యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. ముఖం నుండి మచ్చలను తొలగించడానికి తేనెను ఎలా ఉపయోగించాలి..? తేనెతో ఏ పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేయాలి? దీని గురించి తెలుసుకుందాం.

తేనె- ముల్తానీ మిట్టి: మీ ముఖం మీద ఉన్న మొండి మచ్చలను తొలగించడానికి తేనె, ముల్తానీ మిట్టిని ఉపయోగించవచ్చు.. దీన్ని ఉపయోగించడానికి, ముందుగా ఒక గిన్నెలో 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకోండి. దానిని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. వారానికి రెండుసార్లు దీన్ని అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

తేనె- పాలు: తేనె, పచ్చి పాల మిశ్రమం మచ్చలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడానికి తేనె, పాలను సమాన భాగాలుగా కలిపి మీ ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాలు మసాజ్ చేయండి. తరువాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మచ్చలను తొలగించడంలో గణనీయంగా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తేనె- అరటిపండు: తేనె, అరటిపండు మీ చర్మంలోని మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. ఇందుకోసం సగం అరటిపండు తీసుకొని బాగా మెత్తగా చేయాలి. గుజ్జు చేసిన అరటిపండులో కొద్దిగా తేనె కలపాలి. ఈ ప్యాక్ ను మీ ముఖానికి అప్లై చేసి 20 నుండి 25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల క్రమంగా మచ్చలు తగ్గుతాయి.

తేనె-టమోటా రసం: టమోటా రసం చర్మానికి చాలా ప్రయోజనకరం పనిచేస్తుంది. ఇది మొండి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి, 1 టీస్పూన్ తేనెతో కొద్దిగా టమోటా రసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి, శుభ్రం చేయడానికి ముందు సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచండి.

తేనె- గంధం పొడి: తేనె, గంధం పొడి మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల మచ్చలు తొలగిపోవడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడానికి, 1 టీస్పూన్ తేనెతో కొద్దిగా గంధం పొడి కలపండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..