తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే తయారుచేసే ఈ హెర్బల్ డ్రింక్ తాగితే క్షణాల్లో మాయం!

సాధారణ తలనొప్పికి, మైగ్రేన్ సమస్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ తలనొప్పి కొన్ని గంటల్లో తగ్గుముఖం పడితే, మైగ్రేన్ నొప్పి రోజులకు తరబడి పీడిస్తుంది. తల ఒకవైపు భాగంలో లేదా నొసటి నుండి మెడ వెనుక భాగం వరకు విపరీతమైన నరాల గుంజుడు, సూదులతో గుచ్చినట్లు ఉండే నొప్పి మైగ్రేన్ ప్రధాన లక్షణం. ఈ సమయంలో చిన్నపాటి శబ్దం లేదా వెలుతురు కూడా తీవ్రమైన చికాకును తెప్పిస్తుంది. కొందరిలో వికారం, వాంతులు కూడా అవుతాయి. ఇలాంటి తీవ్రమైన దీర్ఘకాలిక మైగ్రేన్‌ను నివారించడానికి ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన మూలికా పానీయం గురించి తెలుసుకుందాం.

తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే తయారుచేసే ఈ హెర్బల్ డ్రింక్ తాగితే క్షణాల్లో మాయం!
Migraine Relief Drink,
Image Credit source: tv9 assam

Updated on: Sep 21, 2026 | 7:46 AM

తీవ్రమైన మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి సహజసిద్ధమైన మూలికా పానీయం ఎంతగానో ఉపయోగపడుతుంది. మైగ్రేన్ వల్ల తల ఒకవైపు తీవ్రమైన నొప్పితో పాటు, కాంతి, శబ్దాల పట్ల చికాకు, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిరోజు సాయంత్రం వేడివేడిగా ఈ డ్రింక్ తాగడం వల్ల నరాల వ్యవస్థ ఉత్తేజితమై మైగ్రేన్ నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ అద్భుతమైన పానీయం తయారీ, వాడే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

అల్లం – 1 ఇంచ్ ముక్క

మిరియాలు – 10

ఇవి కూడా చదవండి

పసుపు – అర స్పూను

నిమ్మకాయ – 1

నీరు – 300 ml

తయారీ విధానం:

ఒక పాత్రలో 300 ml నీటిని పోసి బాగా మరగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు అందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, పొట్టు తీసి దంచిన అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత అర స్పూన్ పసుపు వేసి వెంటనే స్టవ్ ఆపివేయాలి. పసుపును ఎక్కువ సేపు మరిగించకూడదు. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి, అందులో నిమ్మరసం పిండుకోవాలి.

ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?:

మైగ్రేన్ నొప్పి వచ్చిన సమయంలో లేదా నొప్పి లేనప్పుడు కూడా ఈ పానీయాన్ని తాగవచ్చు. క్రమం తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఈ డ్రింక్ తాగడం వల్ల మైగ్రేన్ మళ్లీ రాకుండా అదుపు చేయవచ్చు. మెరుగైన ఫలితాల కోసం దీనిని కనీసం 30 రోజుల పాటు తీసుకోవడం మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు:

పసుపులోని కర్కుమిన్, అల్లంలోని జింజరోల్ శక్తివంతమైన యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, మెదడులోని నరాల వాపును తగ్గిస్తాయి. మిరియాలలోని పైపెరిన్, అల్లం రక్త ప్రసరణను వేగవంతం చేసి, తలనొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల మైగ్రేన్ వల్ల కలిగే వికారం తగ్గడమే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నిమ్మలోని విటమిన్ సీ శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. సహజ సిద్ధమైన ఈ మూలికా పానీయం మైగ్రేన్‌ను తగ్గించడమే కాకుండా, నరాల వ్యవస్థను బలపరిచి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us