
గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నాయి. ఎందుకంటే.. గ్రీన్ టీలోని టానిన్లు కడుపులో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండెల్లో మంట, అసిడిటీ లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో తాగితే ఈ సమస్యలు మరింత ఎక్కువ కావచ్చు అంటున్నారు..

అతిగా గ్రీన్ టీ తీసుకుంటే నిద్రలేమి, తలనొప్పి బాధిస్తాయి. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్‌కు సున్నితంగా ఉండే వారికి, గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు రావచ్చు. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది కాదు.

వర్షాకాలంలో అల్లం, తులసి, లైకోరైస్ రూట్ వంటి పదార్థాలతో చేసే గ్రీన్ టీ తాగడం వల్ల ఉపశమనం పొందొచ్చు. గొంతు నొప్పి కూడా రాదు. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో వివిధ సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మందులు వేసుకునేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గ్రీన్ టీని పరిమితంగా తీసుకోవాలి. కాలేయ సమస్య ఉన్న వారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. బోలు ఎముకల వ్యాధి ఉన్న వారు గ్రీన్ టీకి స్వస్తి చెప్పాల్సిందే. గర్భవతులు డాక్టర్లను సంప్రదించాకే గ్రీన్ టీని తీసుకోవాలి.

అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని అంటున్నారు. ఒక వేళ మీకు గ్రీన్ టీ తాగాలనిపిస్తే.. వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.