
ఉరుకులు పరుగుల జీవితం.. పనిఒత్తిడి.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ శరీరాన్ని సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తున్నాయి.. ముఖ్యంగా.. ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. అయితే.. అన్ని సమస్యలకు ఊబకాయం (అధికంగా బరువు పెరగడం) కారణమంని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. బరువు తగ్గడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు… అయితే.. బరువు పెరగడం అనేది కొత్త సమస్య కాదు.. కానీ కరోనా వైరస్ మహమ్మారి.. ఇంటి నుండి పని చేయడం.. శారీరక శ్రమ తగ్గడం, వీధుల్లో దొరికే ఆహారం తినడం.. పని ఒత్తిడి పలు కారణాల వల్ల ఈ సమస్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఊబకాయానికి గురవుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారు.. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. బరువు తగ్గడం అనేది చిన్నపిల్లల ఆట లాంటిది కాదు.. దీనికి కఠినమైన ఆహారం.. భారీ వ్యాయామం అవసరం.. కానీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా, మీరు పొట్ట, నడుము కొవ్వును తగ్గించలేకపోతే, మీరు ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నారని అర్థం చేసుకోండి. భారీగా పెరిగిన బరువు, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి.. ఈ రోజువారీ అలవాట్లతో బరువు ఈజీగా తగ్గొచ్చు.. బరువును తగ్గించే 15 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..