Relationship: ఈ 3 విషయాలు తెలిస్తే భార్యాభర్తల మధ్య అస్సలు గొడవలు ఉండవు..!

Relationship: చాలాసార్లు భార్యాభర్తల మధ్య ఎదురయ్యే చిన్న చిన్న అపార్థాలు విడాకుల వరకు వెళుతాయి. ఇవి వివాహబంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు

Relationship: ఈ 3 విషయాలు తెలిస్తే భార్యాభర్తల మధ్య అస్సలు గొడవలు ఉండవు..!
Husband And Wife

Updated on: Apr 08, 2022 | 9:42 PM

Relationship: చాలాసార్లు భార్యాభర్తల మధ్య ఎదురయ్యే చిన్న చిన్న అపార్థాలు విడాకుల వరకు వెళుతాయి. ఇవి వివాహబంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు ఒకరి ముఖాన్ని ఒకరు చూడటానికి కూడా ఇష్టపడని సందర్భాలు ఎదురవుతాయి. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా చాలా దూరంగా ఉంటారు. కోపం, అహం అన్నీ మరిచిపోయి మళ్లీ ఒక్కటవ్వడానికి ప్రయత్నించరు. వాస్తవానికి వివాహ బంధంలో తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. దీని కారణంగా వారి హృదయాలలో దూరం మొదలవుతుంది. సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం కష్టమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏదైనా సంబంధం విజయవంతం కావాలంటే ప్రేమతో పాటు అవగాహన కలిగి ఉండటం అవసరం. పరస్పర సమన్వయం వల్ల అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

1. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం

వాస్తవానికి గొడవల వల్ల భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు తెలుసుకోవడం మానేస్తారు. వారి కోపం, అహం కారణంగా భాగస్వామిని ఇంకా బాధపెడుతూ ఉంటారు. ఈ పరిస్థితిలో వారు విడాకుల వరకు వెళుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. ఏదో ఒక సమయంలో వారు కూడా మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. వారు చెప్పేది ఓపికగా వినండి. ఇలా చేయడం వల్ల వారు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. దీనివల్ల బంధం బలపడుతుంది.

2. సమయం కేటాయించండి

గొడవల వల్ల ఒక్కోసారి భార్యాభర్తలు పార్ట్‌నర్ నుంచి తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటారు. ఈ సమయంలో వారు ఎవ్వరితో మాట్లాడటానికి ఇష్టపడరు. దీనివల్ల సంబంధంలో మరింత దూరం పెరుగుతుంది. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దడానికి మాట్లాడటమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మీ భాగస్వామికి సమయం ఇవ్వండి. వారితో మాట్లాడండి. ఇలా చేస్తే ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇద్దరు కలిసే అవకాశం ఉంటుంది.

3. నిర్లక్ష్యం చేయవద్దు

చాలా మంది తమ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు లేదా గొడవల సమయంలో పట్టించుకోకుండా తప్పు చేస్తారు. కూర్చుని సర్దిచెప్పే బదులు భాగస్వామికి దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ తమ భాగస్వామిని పట్టించుకోకుండా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని వల్ల వారు మీ నుంచి మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాచేయకుండా మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.

IPL 2022: దినేశ్‌ కార్తీక్ మళ్లీ టీమ్‌ ఇండియాకి తిరిగి వస్తాడు.. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ కోచ్..!

Health Tips: నేలపై పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

IPL 2022: రవీంద్ర జడేజా చారిత్రాత్మక మ్యాచ్‌.. ధోని,రైనా తర్వాత ఆ క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడు..