Lemon Tea: పరగడుపున ఖాళీ పొట్టతో లెమన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే..!

|

Oct 25, 2023 | 6:39 AM

నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంతో పాటు చర్మానికి కూడా మంచి చేస్తాయి. లెమన్ టీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు లెమన్ టీని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గుతారు. కాబట్టి రెగ్యులర్‌గా ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగడం వల్ల మేలు జరుగుతుంది.

Lemon Tea: పరగడుపున ఖాళీ పొట్టతో లెమన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే..!
Lemon Tea
Follow us on

చాలా మందికి నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీలు, టీలు తాగడం అలవాటు.. కొంతమంది బ్లాక్ కాఫీ తాగుతారు. మరికొందరు హెర్బల్ టీలు తీసుకుంటుంటారు.. కానీ, ఈ అలవాటు వల్ల శరీరానికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెడ్ టీ తాగడం వల్ల శరీర ప్రాథమిక సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. దీంతో ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధరణంగా ఉండే టీ, కాఫీల కంటే లెమన్ టీ, లెమన్‌ గ్రాస్‌ టీ వంటివి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయ సిట్రస్ పండు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వాటిలో చాలా విటమిన్లు, పోషకాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో ఫోలేట్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ప్రోటీన్లు కూడా ఉన్నాయి. లెమన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. దీన్ని తయారు చేయడానికి ముందుగా నీటిని మరిగించి, ఆపై టీ పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత దానికి నిమ్మరసం కలపాలి. దానికి బెల్లం లేదా తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో లెమన్ టీని చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. లెమన్ టీ కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలోని జీవక్రియను సులభతరం చేయడంలో కూడా ఇవి మేలు చేస్తాయి.

లెమన్ టీని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య ఉన్నవారికి కూడా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి డయాబెటిస్ రోగులు లెమన్ టీని క్రమం తప్పకుండా తాగవచ్చు.

గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, చిటికెడు తేనె కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి బయటపడొచ్చు. పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న లెమన్ టీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంతో పాటు చర్మానికి కూడా మంచి చేస్తాయి. లెమన్ టీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు లెమన్ టీని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గుతారు. కాబట్టి రెగ్యులర్‌గా ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగడం వల్ల మేలు జరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..