
వంటగదిలోని సింక్‌లో నీళ్లు పేరుకుపోయి జామ్ కావడం తరచూ ఎదురయ్యే పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా ఒక సులువైన చిట్కాను పంచుకున్నారు. ఈ సహజమైన పద్ధతి వల్ల ప్లంబర్ అవసరం లేకుండానే సింక్ ఈజీగా క్లీన్ అవుతుంది.. నీరు సాఫీగా వెళ్లిపోతాయి. ఎలా వాసన కూడా ఉండదు. దీని కోసం ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం..
బేకింగ్ సోడా – 1/4 కప్పు
నిమ్మరసం – 1/4 కప్పు
వైట్ వెనిగర్ (తెల్ల సిర్కా) – 1/2 కప్పు
మరుగుతున్న వేడి నీరు – 1 జగ్గు
మొదట సింక్ డ్రెయిన్ రంధ్రంలో పావు కప్పు బేకింగ్ సోడాను సమానంగా వేయాలి. దానిపైనే పావు కప్పు నిమ్మరసం పోసి, ఎలాంటి నీరు తగలకుండా దాదాపు 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత అర్ధ కప్పు వైట్ వెనిగర్‌ను సింక్‌లో పోయాలి. వెనిగర్ పడగానే బేకింగ్ సోడాతో రసాయన చర్య జరిగి దట్టమైన నురుగు, బొబ్బలు వస్తాయి. ఆ నురుగు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, ఒక పెద్ద జగ్గు నిండా బాగా మరిగించిన వేడి నీటిని నేరుగా పైపులో పోయాలి.
బేకింగ్ సోడా, వెనిగర్ కలయిక పైపు లోపలి గోడలకు పట్టుకున్న జిడ్డును, వ్యర్థాలను వదులు చేస్తుంది. నిమ్మరసం మంచి సువాసనను అందిస్తుంది. ఆ వెంటనే పోసే వేడి నీటి తీవ్రతకు లూజ్ అయిన కచరా అంతా కొట్టుకుపోతుంది. ఈ పద్ధతి వల్ల సింక్ క్లీన్ అవ్వడమే కాకుండా, పైపుల నుండి వచ్చే చెడు వాసన కూడా పూర్తిగా తొలగిపోతుంది.
పప్పులు, టీ పొడి, అన్నం మెతుకులు నేరుగా సింక్‌లో పడకుండా చూసుకోవాలి. పాత్రలు కడిగే ముందు వాటిలోని ఆహార వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేయాలి. నూనె, నెయ్యి వంటి జిడ్డు పదార్థాలను డైరెక్ట్‌గా సింక్‌లో వలపకూడదు. వారానికి ఒకసారి సింక్‌లో వేడి నీరు పోయడం అలవాటు చేసుకుంటే డ్రెయిన్ ఎప్పటికీ ఫ్రీగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..