
అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు.. అరటి తొక్కలు త్వరగా నల్లగా మారడం ప్రారంభిస్తాయి. వాటి రుచి కూడా మారడం ప్రారంభమవుతుంది. అరటిపండ్లను చల్లని వాతావరణంలో ఉంచితే అవి త్వరగా చెడిపోవడం ప్రారంభిస్తాయి

పండ్లలో రారాజు అయిన మామిడి పండ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసే పొరపాటు చేయకండి. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు మామిడి పండ్ల రుచిని ప్రభావితం చేస్తాయి. అలాగే మామిడి పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటిపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. కనుక మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచవద్దు.

వేసవిలో లీచీలు పుష్కలంగా లభిస్తాయి. కనుక చాలా మంది ఈ పండ్లను కొంటారు. వీటిని కొనుగోలు చేసిన తర్వాత వారాల పాటు తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల లిచీ పండు లోపలి నుంచి చెడిపోతుంది. అంతేకాదు ఈ పండ్లతో పాటు యాపిల్, బొప్పాయి, అవకాడో, సిట్రస్ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

పైనాపిల్‌ను కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఈ పండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అనాస పండు రుచి చెడిపోతుంది. త్వరగా మృదువుగా మారుతుంది. అంతే కాదు దాని సహజ సువాసన కూడా పోతుంది. కనుక పైనాపిల్‌ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల దాని తాజాదనాన్ని కాపాడుకోవచ్చు.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో ప్రజలు ఈ పండు తినడానికి ఇష్టపడతారు. చాలా మంది మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ఈ పండ్లను చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచుతారు. అందువల్ల ఈ పండును రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల పుచ్చకాయలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. పుచ్చకాయలో పోషక విలువలు కూడా తగ్గుతాయి. అందుకే నిపుణులు పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవద్దని సలహా ఇస్తారు.