Keto Diet: బరువు తగ్గడానికి కీటో డైట్ చేస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..

బరువు తగ్గడానికి రకరకాల డైట్స్ ని పాటిస్తారు. వాటిలో ఒకటి కీటో డైట్. ఈ డైట్ లో కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్ల తీసుకోవడం తగ్గించి, గుడ్లు, చికెన్, చేపలు, పాల ఉత్పత్తులు వంటి కొవ్వు పదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకుంటారు. ఈ ఆహారం బరువు తగ్గించడంలో సహాయపడినప్పటికీ.. ఈ డైట్ ను పాటించడం వలన కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కీటో డైట్ వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Keto Diet: బరువు తగ్గడానికి కీటో డైట్ చేస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..
Keto Diet

Updated on: May 27, 2025 | 8:38 PM

బరువు పెరగడం వలన శరీర రూపాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు శరీరం క్రమంగా వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఈ రోజుల్లో చిన్న వయసులోనే డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. దీనితో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం సర్వసాధారణమైపోయింది. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అందువల్ల బరువు తగ్గడానికి అనేక పద్ధతులు ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఒకటి కీటో డైట్. ఈ డైట్ ని అనుసరించే వ్యక్తులు తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకుంటారు. అధిక కొవ్వులను తినే ఆహారంలో చేర్చుకుంటారు. ఇలా చేయడం వలన శరీరంలోని కొవ్వును కాల్చడంపై దృష్టి పెడతారు.

ఈ డైట్ ని పాటిస్తుంటే బరువు వేగంగా తగ్గుతారు. అయితే ఈ డైట్ వలన చాలా నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా. సోషల్ మీడియాలో వీడియోలు లేదా ఇతర ట్రెండింగ్ వీడియోలను చూసిన తర్వాత, ప్రజలు అలాంటి డైట్‌లను అనుసరించడం ప్రారంభిస్తున్నారు. అయితే చాలామందికి ఈ డైట్ లను అనుసరించడం వలన కలిగే నష్టాల గురించి తెలియదు. ఈ ఆరోగ్యకరమైన డైట్ మీకు ఎలా హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం..

కీటో డైట్ అంటే ఏమిటి?

కీటో డైట్ తక్కువ కార్బోహైడ్రేట్లు , అధిక కొవ్వు తీసుకోవడం అనే సూత్రంపై దృష్టి పెడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి శరీరాన్ని కీటోసిస్ అనే జీవక్రియ పరిస్థితిలోకి తీసుకురావాలి. నిజానికి శరీరం కీటోసిస్ స్థితిలో ఉన్నప్పుడు శక్తి కోసం గ్లూకోజ్‌కు బదులుగా కొవ్వులను కాల్చడం ప్రారంభిస్తుంది. కీటో డైట్‌లో గుడ్లు, చేపలు, మాంసం వంటి జంతు ఆహారాలను ఆహారంలో చేర్చుకుంటారు. దీనితో పాటు, డ్రై ఫ్రూట్స్, పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను ఆహారంలో భాగంగా చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

కీటో డైట్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

శరీరంలో పోషకాహార లోపం ఉండవచ్చు: కీటో డైట్ పాటించడం వల్ల మీ శరీరంలో అవసరమైన పోషకాల లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఆహారాలు తీసుకోరు. దీని కారణంగా ఈ డైట్ ని ఎక్కువ రోజులు చేయడం వలన శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది.

గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం: కీటో డైట్‌లో తినే ఆహారంలో కార్బోహైడ్రేట్‌లు తగ్గుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఎక్కువ కాలం కీటో డైట్ పాటించేవారికి ఇతరులకన్నా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కీటో డైట్‌లో కొవ్వు పదార్ధాలను మాత్రమే తినమని సలహా ఇస్తారు. అయితే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే తినడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు లభించవు.

మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు: గుడ్లు, చేపలు, మాంసం వంటి అధిక కొవ్వు పదార్ధాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మూత్రపిండాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ స్థితిలో కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడవచ్చు.

జీర్ణ సమస్యలు మొదలు: కీటో డైట్‌లో అధిక కొవ్వు పదార్ధాలను తీసుకుంటారు. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్‌లను చేర్చరు. గుడ్లు, చేపలు, పాలు, పెరుగు వంటి కొవ్వు పదార్ధాలను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. కీటో డైట్ పాటించడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఇదే కారణం.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)