
కతీరా గోండ్, దీనిని కటోరా లేదా ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇది ఒక సహజ సిద్ధమైన జిగురు. ఇది గట్టిపడి కటోరా రూపంలో లభిస్తుంది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ పదార్థం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ, ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా, ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కతీరా గోండ్ శరీరానికి చలవ చేయడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కతీరా గోండ్‌ను ఉపయోగించే ముందు, దానిని సుమారు 10 గంటల పాటు నీటిలో నానబెట్టడం ముఖ్యం. ఇది నీటిని పూర్తిగా పీల్చుకొని జెల్ లాంటి పదార్థంగా మారుతుంది. నీటిలో నానబెట్టిన కతీరా జెల్‌ను నేరుగా నీటిలో కలుపుకుని తాగవచ్చు. అయితే, రుచికరమైన పానీయాలను తయారు చేసుకోవాలనుకునేవారికి ఇదిగో డిఫరెంట్ రెసిపీలు ఇలా..
ఇది వేసవిలో దొరికే బెస్ట్ డ్రింక్. ఒక బౌల్‌లో సబ్జా గింజలను నానబెట్టి, అర కప్పు సుగంధి పానకం, రెండు స్పూన్ల నానబెట్టిన సబ్జాలు, మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి తయారు చేస్తారు. రుచికి తగ్గట్టుగా కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ డ్రింక్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
వేసవిలో శరీరానికి అత్యవసరమైన మజ్జిగతో కతీరా గోండ్‌ను కలిపి తీసుకోవచ్చు. మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్‌లో ఒక నిమ్మ చెక్క రసం, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి కలిపి, తరువాత మజ్జిగ పోసి బాగా కలుపాలి. ఇది చప్పగా ఉండకుండా, రుచికరంగా ఉంటుంది.
ఇది కొంచెం ప్రత్యేకమైన రెసిపీ. ముందుగా బాదం పప్పులను నానబెట్టాలి. సమయం లేకపోతే వేడినీళ్లలో నానబెట్టి తొక్క తీయవచ్చు. ఈ బాదం పప్పులను కొద్దిగా నీటితో మెత్తగా పేస్ట్ చేయాలి. పాలను మరిగించి, కొద్దిగా నీటిని, పటిక బెల్లం(లేదా చక్కెర), మూడు యాలకుల పొడి కలిపి, ఆపై బాదం పేస్ట్ వేసి బాగా మరిగించాలి. పాలు చల్లారిన తర్వాత, రెండు స్పూన్ల నానబెట్టిన సబ్జాలు, మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి, ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.
ఈ పానీయం తయారుచేయడానికి, ఒక గ్లాసు పాలను బాగా మరిగించి చల్లార్చాలి. చల్లారిన పాలలో ఒక కప్పు సుగంధి పానకం, మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి, ఫ్రిజ్‌లో చల్లబరచి తాగవచ్చు.
ఇది వేసవిలో శరీరాన్ని అత్యంత చల్లబరిచే పానీయాలలో ఒకటి. ఒక బౌల్‌లో పటిక బెల్లం ముక్క వేసి, కొబ్బరిబొండం నీళ్లు పోసి, పటిక బెల్లం కరిగే వరకు ఉంచాలి. ఆపై మూడు నుండి నాలుగు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి తాగాలి. కొబ్బరి నీళ్లు, పటిక బెల్లం, కతీరా గోండ్ కలిసి శరీరానికి అద్భుతమైన చలవను అందిస్తాయి.
ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.