
భారతీయ కుటుంబాలలో ముఖ్యంగా నవజాత శిశువుల కళ్ళకు కాటుక పెట్టడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఇది వారిని చెడు దృష్టి నుండి కాపాడుతుందని నమ్ముతారు. అయితే, గురుగ్రామ్‌లోని కంప్లీట్ ఐ కేర్ డైరెక్టర్, కంటి నిపుణురాలు డాక్టర్ పారుల్ సోని వివరణ ప్రకారం.. ఈ నమ్మకం తప్పు అంటున్నారు. కాజల్ పిల్లల సున్నితమైన కళ్ళకు హాని కలిగించడమే కాకుండా వారి మొత్తం ఆరోగ్యం, అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని ఆమె చెప్పింది. కాబట్టి, ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఈ మేరకు డాక్టర్ పరుల్ మాట్లాడుతూ, చెడు కన్ను(చెడు దృష్టి) అనేదానికి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. చెడు దృష్టిని నివారించడానికి కాటుక పెట్టడం వల్ల కలిగే ప్రభావాన్ని సమర్థించే ఆధారాలు లేవని చెప్పారు. నిజానికి, ఈ నమ్మకం పూర్తిగా సాంస్కృతిక, సాంప్రదాయకమైనదిగా వెల్లడించారు. సంప్రదాయాలను గౌరవించాలి, అయితే వైద్య శాస్త్రం కంటి ఆరోగ్యానికి కాజల్ వల్ల కలిగే ఎటువంటి ప్రయోజనాలను సమర్థించదు అని అంటున్నారు. కాజల్ వాడకం వల్ల లాభనష్టలేంటో ఇక్కడ చూద్దాం..
కాటుకలోని సీసం ప్రమాదకరం:
చాలా రకాల కాజల్ ఉత్పత్తులలో సీసం, ఇతర భారీ లోహాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి శరీరానికి హానికరం. శిశువుల కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందువల్ల పసిపిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల ఇతర నష్టాలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు.
కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది:
నవజాత శిశువుల కన్నీటి నాళాలు చాలా ఇరుకైనవిగా ఉంటాయి. ఇవి కాజల్ సూక్ష్మ కణాల ద్వారా నిరోధించబడతాయి. ఇది వారి కళ్ళలో చికాకును కలిగిస్తుంది. ఇంకా, కాజల్ పెట్టడానికి ఉపయోగించే కర్రపుల్ల లేదా వేళ్ల ద్వారా క్రిములు పిల్లల కళ్ళలోకి చేరుతాయి. ఇవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది కంటి చికాకు, ఎరుపు, దురద వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు.
మొత్తం ఎదుగుదలకు హాని కలిగిస్తుంది:
నేత్ర వైద్యుల ప్రకారం,.. కాజల్ పిల్లల కళ్ళను మాత్రమే కాకుండా వారి మొత్తం అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని సాంప్రదాయ లేదా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన కాజల్‌లలో సీసం ఉంటుంది. ఈ విషపూరిత మూలకం పిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. రక్తహీనతకు కారణమవుతుంది. ఇంకా, ఇది మొత్తం పెరుగుదలను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారను. అంతేకాదు..పిల్లల్లో ఐ క్యూ లెవల్స్ తగ్గిపోవటం, అభ్యాస వైకల్యం, మాట్లాడటంలో ఆలస్యం, ప్రవర్తనా సమస్యలు, చేసే పనిమీ తక్కువ శ్రద్ధ వంటి సమస్యలను కలిగిస్తుంది.
ఇంట్లో తయారుచేసిన కాజల్ కూడా సురక్షితం కాదు:
ఇంట్లో తయారుచేసిన ఉత్పత్తులు సురక్షితమని సాధారణంగా నమ్ముతారు. కానీ, కాజల్ విషయంలో ఈ నమ్మకం నిజం కాదు. కాజల్‌ను సాంప్రదాయకంగా పత్తి లేదా నెయ్యి ఉపయోగించి తయారుచేసినప్పటికీ, దానిలో చిన్న కార్బన్ కణాలు ఉండవచ్చు అని కంటి నిపుణులు డాక్టర్ పరుల్ చెప్పారు. ఇది పూర్తిగా సూక్ష్మక్రిములు లేనిది కాదు. కాజల్‌ను తయారుచేసేటప్పుడు లేదా సేకరించేటప్పుడు, ఇది బ్యాక్టీరియాతో సోకవచ్చు, ఇది పిల్లల కళ్ళ ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.
తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసినది: –
– నవజాత శిశువులు, పిల్లల కళ్ళలో లేదా చుట్టూ ఎప్పుడూ ఎలాంటి కాస్మెటిక్స్ వంటివి ఉపయోగించవద్దు.
– శుభ్రమైన నీరు, మృదువైన కాటన్ బాల్‌తో కళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయండి.
– ఇతర పిల్లలతో ఎటువంటి కాస్మెటిక్ ఉత్పత్తులను పంచుకోవద్దు.
– మీ బిడ్డ వారి కళ్ళలో ఎరుపు, ఉత్సర్గ (చీము/నీరు కారడం) లేదా వాపును గమనించినట్లయితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..