బరువు పెరగకుండా ఉండటానికి జపాన్ సంస్కృతిలోని 7 అలవాట్లు..!

జపనీయులు ఫిట్‌గా ఉండటానికి అనేక ప్రత్యేకమైన అలవాట్లు పాటిస్తారు. వారు చిన్న మొత్తంలో వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటారు. ఈ అలవాట్లు బరువు నిర్వహణ, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం అనుకూలంగా మారతాయట. బరువు పెరగకుండా ఉండటానికి జపాన్ సంస్కృతిలోని 7 అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరగకుండా ఉండటానికి జపాన్ సంస్కృతిలోని 7 అలవాట్లు..!
Japanese Culture

Updated on: Feb 06, 2025 | 10:26 PM

జపనీయులు ఆరోగ్యకరమైన బరువును మెయిన్ టెయిన్ చేయడానికి, ఫిట్‌గా ఉండటానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తారు. వారి ఆహారం నుండి వారి జీవన విధానంలో అలవాట్ల వరకు.. వారు ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వివిధ పద్ధతులు పాటిస్తారు.

వివిధ రకాల ఆహారం

జపనీయులు చిన్న మొత్తంలో వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటారు. ఇది సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. మెరుగైన పోషణకు ఈ పద్ధతి సహాయం చేస్తుంది. పరిశోధనల ప్రకారం ఇది బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

నెమ్మదిగా తినడం

జపనీయులు నెమ్మదిగా తింటారు. ఈ అలవాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. శరీరం నిండినప్పుడు సంకేతాలు ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన అలవాటు.

రోజువారీ వ్యాయామం

నడక లేదా సైక్లింగ్ వంటి రోజువారీ శారీరక శ్రమను జపనీయులు తమ దినచర్యలో భాగంగా చేసుకుంటారు. ఇది జీవక్రియను పెంచడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి మొత్తం శరీరాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

హర హచి బు సూత్రం

“హర హచి బు” అనేది జపనీయుల సూత్రం. దీని ప్రకారం 80 శాతం కడుపు నిండిన తర్వాత తినడం ఆపేయాలి. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. దీంతో బరువు నిర్వహణ చాలా ఈజీ అవుతుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇది గణనీయమైన బరువు తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది.

తక్కువ చక్కెర, ఎక్కువ గ్రీన్ టీ

జపనీయుల ఆహారంలో చక్కెర తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీ ఎక్కువగా తాగుతారు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. బరువు నిర్వహణకు మద్దతు ఇస్తుంది.

కాలానుగుణంగా తినడం

జపనీయులు ఆయా కాలాల్లో లభించే ఆహారాన్ని తింటారు. ఇది తాజా, మంచి పోషకాలతో నిండిన ఆహారాన్ని శరీరానికి అందిస్తుంది. వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఈ అలవాటు ఏడాది పొడవునా ఆరోగ్యకరమైన పోషకాలను నిరంతరం తీసుకోవడంలో సహాయపడుతుంది.

కలిసి భోజనం చేయడం

జపాన్‌లో ఇతరులతో కలిసి భోజనం చేయడం ఒక సామాజిక కార్యక్రమం. ఇది నెమ్మదిగా.. మరింత మితంగా తినడాన్ని ప్రోత్సహిస్తుంది. చిన్న మొత్తంలో తినడానికి సహాయపడుతుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.