Honey: మీరు వాడుతున్న తేనె స్వచ్ఛమైనదేనా..? ఈ 7 పరీక్షలతో తెలిసిపోతుంది

మీరు కొనుగోలు చేస్తున్న తేనె నిజంగా స్వచ్ఛమైనదేనా? లేక అందులో చక్కెర, నీరు లేదా ఇతర కృత్రిమ పదార్థాలు కలిశాయా? మార్కెట్లో లభించే తేనె స్వచ్ఛతపై చాలామందికి అనుమానాలుంటాయి. అయితే, మీరు వాడే తేనె స్వచ్ఛమైనదా, కాదా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని పరీక్షలున్నాయి. ఈ 7 సులభమైన చిట్కాలను పాటించి, మీ తేనె నాణ్యతను మీరే తనిఖీ చేసుకోండి.

Honey: మీరు వాడుతున్న తేనె స్వచ్ఛమైనదేనా..? ఈ 7 పరీక్షలతో తెలిసిపోతుంది
7 Easy Diy Tests To Detect Pure Honey

Updated on: Jul 21, 2025 | 9:06 PM

మీరు వాడే తేనె స్వచ్ఛమైనదేనా? నకిలీ తేనెను గుర్తించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లోనే సులభంగా చేయగలిగే 7 ప్రాక్టికల్ పరీక్షలతో తేనెలో చక్కెర, నీరు లేదా కృత్రిమ పదార్థాలు కలిశాయో లేదో తెలుసుకోండి. మీ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తేనెను ఎంచుకోండి.

నీటి పరీక్ష: ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తేనె వేయండి. కదిలించకుండా తేనె కరగడం గమనించండి. స్వచ్ఛమైన తేనె అయితే గ్లాసు అడుగుకు చేరి, ఒక ముద్దగా అలాగే ఉంటుంది. నకిలీ తేనె లేదా చక్కెర, సిరప్‌లు కలిసిన తేనె నీటిలో త్వరగా కరిగిపోతుంది.

అగ్గిపుల్ల పరీక్ష: ఒక కాటన్ విక్‌ను తేనెలో ముంచి, అదనంగా ఉన్న తేనెను తొలగించండి. ఆ తర్వాత అగ్గిపుల్ల లేదా లైటర్‌తో వెలిగించండి. స్వచ్ఛమైన తేనె అయితే శుభ్రంగా మండుతుంది. నీరు కలిసిన తేనె అయితే మండదు లేదా చిన్నగా కాలుతుంది. (ఈ పరీక్ష చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.)

బొటనవేలు పరీక్ష: మీ బొటనవేలుపై ఒక చుక్క తేనె వేసి కొన్ని సెకన్ల పాటు గమనించండి. స్వచ్ఛమైన తేనె వేలిపై స్ప్రెడ్ అవ్వకుండా అలాగే చిక్కగా, గట్టిగా ఉంటుంది. నకిలీ తేనె అయితే వెంటనే వేలిపై పల్చబడి విస్తరిస్తుంది.

నీరు, వెనిగర్ పరీక్ష: ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా నీరు, కొన్ని చుక్కల వెనిగర్ కలపండి. స్వచ్ఛమైన తేనె ఎలాంటి ప్రతిచర్య చూపదు. నకిలీ తేనె అయితే గిన్నెలో నురగలు లేదా బుడగలు ఏర్పడవచ్చు.

వేడి పరీక్ష (మెటల్ స్పూన్‌తో): ఒక మెటల్ స్పూన్‌లో కొద్దిగా తేనె తీసుకుని, మంటపై వేడి చేయండి. స్వచ్ఛమైన తేనె త్వరగా కారామెలైజ్ అయి చిక్కగా మారుతుంది. నకిలీ తేనెలో చక్కెర లేదా ఇతర కృత్రిమ పదార్థాలు కలపడం వల్ల వేడి చేసినప్పుడు బుడగలు, నురుగు లేదా మండటం వంటివి జరగవచ్చు.

టిష్యూ పేపర్ పరీక్ష: ఒక టిష్యూ లేదా బ్లాటింగ్ పేపర్‌పై ఒక చుక్క తేనె వేయండి. స్వచ్ఛమైన తేనె అయితే పేపర్‌లోకి ఇంకదు. నకిలీ తేనె లేదా నీరు కలిసిన తేనె అయితే వెంటనే పేపర్‌లోకి ఇంకిపోతుంది.

ఈ పరీక్షలు తేనె స్వచ్ఛతను అంచనా వేయడంలో మీకు సహాయపడతాయి. అయితే, అత్యంత కచ్చితమైన ఫలితాల కోసం ప్రయోగశాల పరీక్షలు ఉత్తమం.