గర్భం అనేది స్త్రీ జీవితంలో అత్యంత అందమైన దశ. ఈ సమయంలో తల్లి తన ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడుపులో బిడ్డ ఎదుగుదల కోసం తల్లి అన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటుంది. అదే సమయంలో కొన్ని వింత విశ్వాసాలు, నమ్మకాలు కూడా పాటిస్తుంటారు. కొంతమంది స్త్రీలు తెల్లటి బిడ్డ పుట్టాలని కోరుకుంటూ కుంకుమపువ్వును తీసుకుంటారు. పురాతన కాలం నుండి ఇలాంటి నమ్మకం ప్రాచుర్యంలో ఉంది. పుట్టబోయే బిడ్డలు తెల్లగా పుట్టాలని, అందుకోసం కుంకుమపువ్వు పాలు తాగాలని సలహా ఇస్తూనే ఉన్నారు. ఇది నేటికీ అనుసరిస్తున్నారు. నిజంగానే గర్బీణిలు కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పుడుతుందా..? లేక అపోహ మాత్రమేనా అనేది ప్రశ్న. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం…
గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకుంటే బిడ్డ తెల్లగా పుడుతుందా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం,.. తల్లి కుంకుమపువ్వు పాలు తీసుకోవడం వల్ల బిడ్డ తెల్లగా మారడానికి ఎలాంటి సంబంధం లేదు. పుట్టిన శిశువు తెల్లగా ఉన్నాడా లేక నల్లగా ఉన్నాడా అనేది పూర్తిగా మెలనిన్, జన్యువులపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో మెలనిన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చర్మం నల్లగా మారుతుంది. అయితే మెలనిన్ సమతుల్యత మొత్తం చర్మం రంగును తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.
కుంకుమపువ్వు, పాల గురించి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, దాని వల్ల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల శిశువు తెల్లగా మారుతుందని అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఏదైనా తినడానికి, తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏదైనా తప్పుగా తింటే అది మీకు హాని కలిగించవచ్చు.
కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా మూడ్ స్వింగ్స్ సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా కోపం, చిరాకు, ఏదైనా వెంటనే ఏడవడం వంటి అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఇది మూడ్ స్వింగ్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. దీని వినియోగం సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు సమస్యలు సాధారణం. అటువంటి పరిస్థితిలో కుంకుమపువ్వు తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో మహిళలు గ్యాస్ట్రిక్, అజీర్ణం, వాంతులు వంటి జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఈ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో కుంకుమపువ్వు జీవక్రియను పెంచుతుంది. అంతే కాదు కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..