Injected Watermelon Identification: కెమికల్ ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ ఎలా ఉంటుందో తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహార పదార్థాలలో ఎన్నింటిలో రసాయనాలు ఉన్నాయో ఊహించడం కష్టంగా మారింది. ముంబైలో పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన కృత్రిమంగా పండించిన పండ్ల ప్రమాదాన్ని స్పష్టం చేస్తోంది. పుచ్చకాయలు త్వరగా పెరగడానికి, లోపల ఆకర్షణీయమైన ఎరుపు రంగు రావడానికి ఇంజెక్షన్ల ద్వారా రసాయనాలను ఉపయోగిస్తున్నారు. పౌర ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, రసాయనాలతో పండించిన పుచ్చకాయలను గుర్తించేందుకు పాటించాల్సిన కీలకమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.

Injected Watermelon Identification: కెమికల్ ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ ఎలా ఉంటుందో తెలుసా?
Injected Watermelon Identification

Updated on: Apr 30, 2026 | 8:04 PM

సహజంగా పండిన పుచ్చకాయలు ముదురు ఆకుపచ్చ రంగులో స్పష్టమైన చారలను కలిగి ఉంటాయి. రసాయనాలతో పండించినవి తరచుగా మరీ ప్రకాశవంతంగా లేదా కృత్రిమమైన ఏకరీతి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి.

నిజమైన పుచ్చకాయకు అది నేల వైపు ఉన్న భాగంలో పసుపు లేదా క్రీమ్ రంగు మచ్చ ఏర్పడుతుంది. ఈ మచ్చ లేకపోయినా లేదా చాలా లేతగా ఉన్నా అది కృత్రిమంగా పండించినది కావొచ్చు.

సహజంగా పండిన పండును తట్టినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్లు బోలుగా శబ్దం వస్తుంది. ఆ శబ్దం బరువుగా లేదా బొంగురుగా ఉంటే అది సరిగ్గా పండలేదని లేదా రసాయనాలతో శుద్ధి చేశారని అర్థం.

సహజమైన పుచ్చకాయలు ముదురు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి. రంగు మరీ ప్రకాశవంతమైన ఎరుపుగా ఉండి, లోపల తెల్లటి లేదా పసుపు రంగు ఈనలు (Veins) స్పష్టంగా కనిపిస్తే అది రసాయనాల ప్రభావం అని గుర్తించాలి.

పుచ్చకాయను కోసిన తర్వాత, ఒక చిన్న దూది ముక్కతో లోపల తుడవండి. ఒకవేళ దూదికి ముదురు ఎరుపు రంగు అంటుకుంటే, అందులో రంగుల రసాయనాలు కలిపి ఉన్నాయని నిర్ధారించుకోవచ్చు.

అసలైన పండు తియ్యగా, తాజాగా ఉంటుంది. రుచి చప్పగా ఉన్నా లేదా నాలుకపై కొద్దిగా పులుపు తగిలినా దానిలో రసాయనాలు ఉన్నట్లు అనుమానించాలి.

పండ్లు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మార్కెట్లో అప్పటికే కోసి ఉంచిన పుచ్చకాయ ముక్కలను అస్సలు కొనకూడదు. పండును ఇంటికి తెచ్చిన తర్వాత తప్పకుండా పైభాగం శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా పిల్లలు వృద్ధులకు పండ్లు ఇచ్చే ముందు అవి తాజాగా, సహజంగా ఉన్నాయో లేదో మరోసారి తనిఖీ చేయడం ఎంతో ముఖ్యం.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల విశ్లేషణలు వైద్య నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పుచ్చకాయ తిన్న తర్వాత అసాధారణమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Follow Us