Extramarital Affairs: పెళ్లైనా ఆ రిలేషనే కావాలి.. గుట్టుగా కానిచ్చేస్తున్న జంటలు.. అందులో ఈ నగరమే టాప్..

వాస్తవానికి భారతీయులు ప్రతి సంబంధానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ప్రస్తుత యువతరం ఆధునికతకు అలవాటు పడుతున్న కొద్దీ సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు. అందుకే ఇటీవలి రోజుల్లో అక్రమ సంబంధాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం ‘గ్లీడెన్‌’ తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించింది.

Extramarital Affairs: పెళ్లైనా ఆ రిలేషనే కావాలి.. గుట్టుగా కానిచ్చేస్తున్న జంటలు.. అందులో ఈ నగరమే టాప్..
Extra Marital Affairs

Updated on: Oct 25, 2025 | 12:48 PM

ఇటీవలి కాలంలో వివాహేతర లేదా అక్రమ సంబంధాల (Extramarital affairs) కేసులు బాగా పెరిగాయి.. ముఖ్యంగా.. బిజీ లైఫ్‌స్టైల్.. పెళ్లైన తర్వాత ఒకరిమీద ఒకరికి ఆసక్తి తగ్గడం, కుటుంబ, అనారోగ్య సమస్యలు, ఒత్తిడి, ఇలా అనేక కారణాల వల్ల ఈ విష సంబంధాలు పెరిగిపోతున్నాయి.. ఇలాంటి వివాహేతర సంబంధాల మోజులో పురుషులతోపాటు.. మహిళలకు కూడా ఎంతకైనా తెగిస్తున్న ఘటనలు మనం ఇటీవల కాలంలో ఎన్నో చూస్తున్నాం.. వాస్తవానికి భారతీయులు ప్రతి సంబంధానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ప్రస్తుత యువతరం ఆధునికతకు అలవాటు పడుతున్న కొద్దీ సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు. అందుకే ఇటీవలి రోజుల్లో అక్రమ సంబంధాలు, వైవాహిక జీవితంలో చీలికలు, సాన్నిహిత్యం లేకపోవడం లాంటివి పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. ఈ క్రమంలోనే.. ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం ‘గ్లీడెన్‌’ తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. గ్లీడాన్ వివాహేతర అక్రమ సంబంధాల కేసులు అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను ప్రచురించింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అక్రమ సంబంధాలు ఉన్న నగరంగా బెంగళూరు నిలించింది. ఈ మేరకు గ్లీడాన్ సంచలన వాస్తవాన్ని నివేదికలో పంచుకుంది..

భారతదేశంలో గ్లీడెన్ యాప్‌ ద్వారా నమోదు అయిన వినియోగదారులలో 20 శాతం మంది బెంగళూరుకు చెందిన వారే ఉన్నారని పేర్కొంది.. అలాగే బెంగళూరు తరువాతి స్థానాల్లో ముంబై 19శాతం, కోల్‌కతా 18శాతం, ఢిల్లీ 15 శాతం, పూణె 10 శాతం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మూడు మిలియన్లకు పైగా వ్యక్తులు ఈ ప్లాట్‌ఫాంలో యాక్టీవ్‌గా ఉన్నట్లు పేర్కొంది. ఇతర రంగాల కన్న ఐటీ, వైద్య రంగాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారని గ్లీడెన్ సంస్థ తెలిపింది. టైర్-1 నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో కూడా ఈ ధోరణి పెరుగుతుందని గ్లీడెన్ నివేదిక పేర్కొంది.. అయితే ఈ వివాహేతర సంబంధాల్లో హైదరాబాద్ నగరం అధికారికంగా టాప్ 5 లో లేకపోవడం గమనార్హం..

అవిశ్వాసం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి..

విడాకుల కేసులను నిర్వహించే న్యాయవాదులు – సంబంధాల నిపుణులు.. ఇలాంటి వివాహేతర సంబంధాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.. ముఖ్యంగా అవిశ్వాసం – వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణం భావోద్వేగ అసంతృప్తి, వ్యక్తిగత అవసరాలు తీర్చకపోవడం, శారీరక – మానసిక సాన్నిహిత్యం లేకపోవడం, వివాహేతర యాప్‌ల వాడకం అని అంటున్నారు.

శారీరక సంబంధం కంటే భావోద్వేగ మద్దతు కోసం..

గ్లీడాన్ ఇండియా మేనేజర్ సిబిల్ షిడెల్ మాట్లాడుతూ.. భారతదేశంలో 3 మిలియన్ల మంది గ్లీడాన్ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇందులో 17% మంది బెంగళూరుకు చెందినవారున్నారు. వీరిలో ఎక్కువ మంది 30 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారున్నారని పేర్కొన్నారు. ఈ యాప్‌ను ఉపయోగించే వారిలో 65% మంది పురుషులు. 35% మంది మహిళలున్నారు. అయితే యాప్‌ను ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ఆర్థిక, చట్టం, ఇంజనీరింగ్ – వ్యవస్థాపకత వంటి నేపథ్యాలకు చెందిన వారున్నారు. శారీరక సంబంధం కంటే భావోద్వేగ మద్దతు కోసం ఈ యాప్ వాడకం పెరుగుతోందని అధ్యయనం తెలిపింది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..