
నారింజ పండ్ల మాదిరిగానే దాని తొక్క కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని మీకు తెలుసా? అవును.. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి. మీరు నారింజ తొక్కలను ఎండబెట్టి, వాటి పొడిని ఉపయోగించి మీ ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే హెర్బల్ టీ కూడా తయారు చేసుకుని తాగవచ్చు. కాబట్టి నారింజ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
నారింజ తొక్కలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. వాటిలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు నారింజ తొక్కలను లేదా దాని పొడిని నీటితో కూడా కలిపి తాగవచ్చు.
నారింజ తొక్కల పొడిని కొబ్బరి నూనెలో కలిపి ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.
నారింజ తొక్కల పొడిని చర్మానికి పూయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మ నూనెను నియంత్రిస్తుంది. దాని యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నారింజ పండ్లలో అత్యధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. అలాగే దీని తొక్కలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందుకు నారింజ తొక్కల నుంచి టీ తయారు చేసి ప్రతిరోజూ తాగవచ్చు.
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, నారింజ తొక్కలతో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ తొక్కలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆకలిని నియంత్రించడంలో, అతిగా తినడం తగ్గించడంలో, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
నారింజ తొక్కను చేతులు, కాళ్ళను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ తొక్క సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మీ చేతులు, కాళ్ళను శుభ్రం చేయడానికి నారింజ తొక్కను పాదాలకు రుద్దవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది. నారింజ తొక్కతో తయారు చేసిన సహజ స్క్రబ్ చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
నారింజ తొక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయ. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఈ తొక్కను నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన తొలగిపోతుంది. నారింజ తొక్క నీటిని పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.